Savitri : టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఎంత మంది హీరోయిన్స్ వచ్చినప్పటికీ ‘మహానటి’ సావిత్రికి ఉన్న స్థానం ఆమెకే ఉంటుంది. తెలుగు తెరపై అగ్రతారగా వెలుగొందిన ఆమె తెలుగు ప్రజల మనసుల్లో ఎప్పటికీ ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావుతో పాటు అగ్ర తారలైన హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది సావిత్రి.
అయితే, ఆమె కెరీర్ చివర దశలో మాత్రం ఆమె మరణించిన తీరు అందరినీ కలిచివేసింది. ఈ సంగతి అలా ఉంచితే.. సావిత్రి 1960వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. అప్పట్లోనే ఆమెకు ఖరీదైన ప్లాట్లు, బంగ్లాలు ఉండేవట. అప్పట్లో సినిమాకు టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా ఆమెకే పేరుంది.
సౌత్ ఇండియాలో ఆమెను మించి రెమ్యునరేషన్ తీసుకున్న నటీమణులు అప్పట్లో లేరు. సావిత్రి అన్నపూర్ణ బ్యానర్లో ‘చదువుకున్న అమ్మాయిలు’ అనే ఫిల్మ్ చేసింది. 1963లో ఆ సమయంలో సావిత్రి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో రూ.50 వేలు పెట్టి నేషనల్ ప్రైజ్ బాండ్స్ కొనాలని చెప్పి వెళ్లిపోయిందట. అప్పట్లో రూ.50 వేలు అంటే పది లక్షల రూపాయలు అన్నట్లు విలువ ఇచ్చేవారు. కాగా, ఆ డబ్బు తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్‌కు రాత్రంతా అస్సలు నిద్రపట్టలేదట. ఓ చోట భద్రపరిచి తర్వాత డబ్బున్ బాండ్స్ రూపంలోకి మార్చి సావిత్రికి ఇచ్చేశాడట.
అయితే, ఆ బాండ్స్ ఇచ్చినపుడు సావిత్రి వాటిని కనీసమాత్రంగానైనా పట్టించుకోలేదట. అయితే, అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ రూ.50 వేలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అది మామూలు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అనుకున్నాయట. అప్పట్లోనే ఆమెకు కాస్ట్లీ ఆర్నమెంట్స్, బంగ్లాలు ఉండేవి. మహానటి సావిత్ర బయోపిక్‌ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘మహానటి’గా తెరకెక్కించగా, ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో లీడ్ రోల్ బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ ప్లే చేయగా, ఆమెకు నేషనల్ అవార్డు లభించింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.