Savitri : ‘మహానటి’ సావిత్రి 1960వ దశకంలోనే అంత ఆస్తి ఉందా.. షాకింగ్ నిజాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Savitri : ‘మహానటి’ సావిత్రి 1960వ దశకంలోనే అంత ఆస్తి ఉందా.. షాకింగ్ నిజాలు..!

 Authored By mallesh | The Telugu News | Updated on :17 November 2021,6:15 am

Savitri : టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఎంత మంది హీరోయిన్స్ వచ్చినప్పటికీ ‘మహానటి’ సావిత్రికి ఉన్న స్థానం ఆమెకే ఉంటుంది. తెలుగు తెరపై అగ్రతారగా వెలుగొందిన ఆమె తెలుగు ప్రజల మనసుల్లో ఎప్పటికీ ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావుతో పాటు అగ్ర తారలైన హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది సావిత్రి.

అయితే, ఆమె కెరీర్ చివర దశలో మాత్రం ఆమె మరణించిన తీరు అందరినీ కలిచివేసింది. ఈ సంగతి అలా ఉంచితే.. సావిత్రి 1960వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. అప్పట్లోనే ఆమెకు ఖరీదైన ప్లాట్లు, బంగ్లాలు ఉండేవట. అప్పట్లో సినిమాకు టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా ఆమెకే పేరుంది.

Savitri : అసిస్టెంట్ డైరెక్టర్ కు అంత డబ్బిచ్చిన సావిత్రి..

Saitri 1960 income history

Saitri 1960 income history

సౌత్ ఇండియాలో ఆమెను మించి రెమ్యునరేషన్ తీసుకున్న నటీమణులు అప్పట్లో లేరు. సావిత్రి అన్న‌పూర్ణ బ్యాన‌ర్లో ‘చ‌దువుకున్న అమ్మాయిలు’ అనే ఫిల్మ్ చేసింది. 1963లో ఆ స‌మ‌యంలో సావిత్రి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో రూ.50 వేలు పెట్టి నేష‌న‌ల్ ప్రైజ్ బాండ్స్ కొనాలని చెప్పి వెళ్లిపోయిందట. అప్పట్లో రూ.50 వేలు అంటే పది లక్షల రూపాయలు అన్నట్లు విలువ ఇచ్చేవారు. కాగా, ఆ డబ్బు తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్‌కు రాత్రంతా అస్సలు నిద్రపట్టలేదట. ఓ చోట భద్రపరిచి తర్వాత డబ్బున్ బాండ్స్ రూపంలోకి మార్చి సావిత్రికి ఇచ్చేశాడట.

అయితే, ఆ బాండ్స్ ఇచ్చినపుడు సావిత్రి వాటిని కనీసమాత్రంగానైనా పట్టించుకోలేదట. అయితే, అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ రూ.50 వేలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అది మామూలు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అనుకున్నాయట. అప్పట్లోనే ఆమెకు కాస్ట్లీ ఆర్నమెంట్స్, బంగ్లాలు ఉండేవి. మహానటి సావిత్ర బయోపిక్‌ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘మహానటి’గా తెరకెక్కించగా, ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో లీడ్ రోల్ బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ ప్లే చేయగా, ఆమెకు నేషనల్ అవార్డు లభించింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది