Salaar Story : సలార్ మూవీ స్టోరీ ఇదే.. లీక్ అయిన కథ.. సోషల్ మీడియాలో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Salaar Story : సలార్ మూవీ స్టోరీ ఇదే.. లీక్ అయిన కథ.. సోషల్ మీడియాలో వైరల్

Salaar Story : ప్రభాస్ సలార్ మూవీ తెలుసు కదా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ తాజాగా లీక్ అయింది. లీక్ అనేకంటే కూడా ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీలే ఈ సినిమా స్టోరీని లీక్ చేశాడని చెప్పుకోవాలి. నిజానికి ఈ మూవీ ఇంకొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచమే ఇప్పుడు సలార్ మూవీ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 22న […]

 Authored By kranthi | The Telugu News | Updated on :29 November 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  ఇద్దరు స్నేహితుల జర్నీనే సలార్

  •  ఇద్దరు స్నేహితులు ఎందుకు బద్ధ శత్రువులుగా మారారు?

  •  స్నేహం అనే ఎమోషన్ ఈ సినిమాకు హైలెట్

Salaar Story : ప్రభాస్ సలార్ మూవీ తెలుసు కదా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ తాజాగా లీక్ అయింది. లీక్ అనేకంటే కూడా ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీలే ఈ సినిమా స్టోరీని లీక్ చేశాడని చెప్పుకోవాలి. నిజానికి ఈ మూవీ ఇంకొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచమే ఇప్పుడు సలార్ మూవీ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు ప్రశాంత్ నీల్. ట్రైలర్ కోసమే జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే.. ఇక మూవీ కోసం ఇంకెంత కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాలి చెప్పండి. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. సినిమా స్టోరీ ఏంటో చెప్పేశాడు. దీంతో ప్రస్తుతం అందరి కళ్లు సలార్ స్టోరీ మీదనే పడ్డాయి. ఇంతకీ సలార్ స్టోరీ ఏంటి.. అసలు ప్రశాంత్ నీల్ ఏం చెప్పాడు అనేది తెలుసుకుందాం రండి.

ముందు మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే.. కేజీఎఫ్ కు, ఈ సినిమా స్టోరీకి అస్సలు సంబంధమే ఉండదు. కాకపోతే సలార్ కూడా రెండు పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22 న రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులకు సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఇద్దరు స్నేహితులకు సంబంధించింది. ఇద్దరు స్నేహితులు.. బద్ధ శత్రువులు అయితే ఎలా ఉంటుంది అనేదే సినిమా కథ. కొన్ని సంఘటనల వల్ల వాళ్లు బద్ధ శత్రువులు అవుతారు. స్నేహం అనేదే ఈ సినిమాలో ముఖ్యమైన ఎమోషన్. దాన్నే తొలి భాగంలో ఎక్కువగా చూపించబోతున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్.. ఎలా స్నేహితులుగా ఉన్నారు.. ఆ తర్వాత ఇద్దరూ బద్ధ శత్రువులుగా ఎలా మారారు.. వాళ్లు ఎందుకు అలా మారారు? అనేదే అసలు సినిమా.

Salaar Story : డిసెంబర్ 1 న ట్రైలర్ విడుదల

డిసెంబర్ 1న సలార్ తొలి పార్ట్ ట్రైలర్ రానుంది. తొలి పార్ట్ కు సీజ్ ఫైర్ అనే క్యాప్షన్ పెట్టారు. రెండో పార్ట్ పేరు ఇంకా ప్రకటించలేదు. కాకపోతే సినిమా విడుదలైన తర్వాత సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి రెండో పార్ట్ కథలో ఏమైనా మార్పులు చేసుకోవాలా అనేది మూవీ యూనిట్ ఆలోచించనుంది. అయితే.. కేజీఎఫ్ కు, ఈ సినిమాకు మాత్రం అస్సలు బంధం లేదు. ఆ మూవీ స్టోరీ వేరు.. ఈ మూవీ స్టోరీ వేరు. ఇక.. సలార్ మూవీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మూవీ స్టోరీ తెలుసుకున్నాక ప్రభాస్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్, మూవీ రిలీజ్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది