Salaar movie released March
Salaar Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా ఇంకా లేట్ అవుతున్నట్లే కనిపిస్తుంది. వచ్చే సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది. అసలు సంక్రాంతి పండగ అంటే టాలీవుడ్ లో అతిపెద్ద సినిమా పండుగ.
సంక్రాంతి ఫెస్టివల్ టైంలో సినిమాలు ఎక్కువగా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. స్టార్ హీరోలు కూడా అదే డేట్ ను ఎక్కువగా కోరుకుంటారు. ఈసారి కూడా వచ్చే ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ కి ఇప్పటి నుంచే గట్టి పోటీ మొదలైంది. కొందరు స్టార్ హీరోలు ఆ టైంలో తమ సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న వర్కౌట్ కావట్లేదు. కొంతమంది మాత్రం పక్కా ప్లాన్ తో సినిమాలు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. వీటిలో సంక్రాంతికి ఖచ్చితంగా వచ్చే సినిమా లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమా ఉంది. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా సంక్రాంతికి వచ్చే సినిమాల లిస్టులో ఉంది. ఈ రెండు జనవరి 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.
Salaar movie released March
అలాగే మాస్ మహారాజ్ రవితేజ ‘ ఈగల్ ‘ మూవీ జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ బట్టి మరల డేట్ మారే ఛాన్స్ ఉంది. అలాగే కింగ్ నాగార్జున ‘ నా సామి రంగా ‘ కూడా జనవరి 14న ఒక ప్రీ టీజర్ తో అనౌన్స్ చేశారు. రీసెంట్గా షూటింగ్ స్టార్ట్ అయింది. అప్పటికల్లా విడుదల అవుతుందో లేదో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ పరుశురాం కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా జనవరి 13న రిలీజ్ చేసే ఆలోచనలో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉన్నారు. అలాగే తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న ‘ పయలన్ ‘ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఇక ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమా సంక్రాంతికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినా కూడా మార్చి 22న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శకుడు ప్రశాంత్ ఉన్నారట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.