
#image_title
Bigg Boss Telugu 7 : ఈవారం నామినేషన్లు కూడా బిగ్ బాస్ హౌస్ లో వాడీ వేడీగా జరగబోతున్నాయి. ఎందుకంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మూడు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్లలో ఏమాత్రం తేడా కొట్టినా ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో అని టెన్షన్ ఇంటి సభ్యులు, కంటెస్టెంట్లలో ఉంది. అందుకే కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్లను కూడా చాలెంజింగ్ గా తీసుకున్నారు. బిగ్ బాస్ అప్పుడే నాలుగో వారానికి వచ్చింది. నామినేషన్ల గురించి పక్కన పెడితే.. ఇంట్లో శివాజీ, రతిక మధ్య ఒక చిన్న డిస్కషన్ నడిచింది. నాగార్జున ముందు ప్రశాంత్, రతిక ఇద్దరి రిలేషన్ షిప్ గురించి రెండు చేతులు ఒకేసారి కలిశాయి సార్ అందుకే ఇద్దరి గురించి అందరికీ తెలిసింది. ఎవరి వెంట ఎవరు పడటం లేదు.. ఇద్దరూ అలాగే ఉన్నారు అన్నట్టుగా శివాజీ మాట్లాడటంతో ఆ విషయం రతికకు నచ్చలేదు.
#image_title
తాజాగా ఈ విషయంపై శివాజీతో డిస్కషన్ పెట్టింది. ఆ మాట ఎందుకు అన్నావు అన్నా అంటే.. నేను అనకపోయినా వీడియో వేసి చూపిస్తారు కదా అప్పుడు ఏంటి మీ పరిస్థితి. సరదాగా ఉన్నదే కదా నేను అన్నది అంటాడు శివాజీ. దీంతో వీడియోలు వేస్తే వేయనీయ్ అన్నా. నాకు హ్యాపీ. ఒక అమ్మాయిగా నాకు అలా అనిపిస్తోంది అంటుంది రతిక. నువ్వు నాకు క్లాస్ పీకుతున్నావు అంతే కదా. నువ్వు హర్ట్ అయ్యావనే కదా సారీ చెప్పింది. ఇంకా ఏం చేయాలి చెప్పు.. కాళ్లు పట్టుకోవాల్నా చెప్పు అంటాడు శివాజీ. దీంతో అది కాదు అన్న అంటుంది రతిక. మరి ఎందుకు సాగదీస్తున్నావు. వాంటెడ్ గా అనిపిస్తోంది ఇదంతా అంటాడు శివాజీ.
ఇక.. నాలుగో వారం నామినేషన్లలో భాగంగా ప్రిన్స్ యావర్.. తేజ, ప్రియాంకను నామినేట్ చేశాడు. అయితే.. ఈసారి ఏ కంటెస్టెంట్ అయినా నామినేట్ చేస్తే.. నామినేషన్స్ కి సరైన రీజన్స్ చెప్పాలి. అందులోనూ ఇంటి సభ్యులు ముగ్గురు శోభా శెట్టి, శివాజీ, సందీప్ ఈ ముగ్గురు జడ్జీలుగా ఉంటారు. వాళ్లు ఓకే అంటేనే ఆ నామినేషన్స్ వేసినట్టు. ప్రిన్స్ యావర్ తాను ఎందుకు ప్రియాంక, తేజ ఇద్దరికీ నామినేషన్స్ వేస్తున్నాడో చెబుతాడు కానీ.. దాన్ని వాళ్లు తీసుకోరు. అసలు ఇవి రీజన్సే కాదు. నువ్వే బిగ్ బాస్ ప్రాపర్టీస్ పగుల గొట్టావు అంటూ ప్రియాంక.. యావర్ మీదికి రివర్స్ అవుతుంది. శోభ కూడా యావర్ రీజన్స్ ను ఒప్పుకోదు. తేజ కూడా యావర్ రీజన్స్ తో ఒప్పుకోడు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.