
Salaar release date fixed
Salaar : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరిగా రాధే శ్యామ్‌తో పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో సలార్ ఒకటి. కేజిఎఫ్, కేజిఎఫ్ 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడం, ప్రభాస్ పూర్తి స్థాయి మాస్ లుక్ లో కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద ఏర్పడుతున్న అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి..
ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. చెప్పినట్టుగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ అప్డేట్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందులో ప్రభాస్ కత్తి పట్టి నరికిన తీరు, ఆ శవాలు అలా పడి ఉండటం, రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టి చేస్తోన్న యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన పోస్టర్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు. ఇక ఇందులో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు.
Salaar release date fixed
ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, విశాల్ వదిన శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కేజిఎఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేజిఎఫ్ సిరీస్ కి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శివకుమార్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాకు అన్బరువు యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.