Salaar : ఇండిపెండెన్స్ డే రోజు అదిరిపోయే గిఫ్ట్.. స‌లార్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Salaar : ఇండిపెండెన్స్ డే రోజు అదిరిపోయే గిఫ్ట్.. స‌లార్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 August 2022,3:20 pm

Salaar : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చివ‌రిగా రాధే శ్యామ్‌తో ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో స‌లార్ ఒక‌టి. కేజిఎఫ్, కేజిఎఫ్ 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడం, ప్రభాస్ పూర్తి స్థాయి మాస్ లుక్ లో కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద ఏర్పడుతున్న అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి..

Salaar : అంచ‌నాలు భారీగా..

ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. చెప్పినట్టుగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ అప్డేట్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందులో ప్రభాస్ కత్తి పట్టి నరికిన తీరు, ఆ శవాలు అలా పడి ఉండటం, రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టి చేస్తోన్న యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన పోస్టర్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు. ఇక ఇందులో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు.

Salaar release date fixed

Salaar release date fixed

ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, విశాల్ వదిన శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కేజిఎఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేజిఎఫ్ సిరీస్ కి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శివకుమార్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాకు అన్బరువు యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Image

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది