Home » Entertainment » Niharika Konidela Punches To Hyper Aadi In Sridevi Drama Company
Entertainment

Niharika Konidela : నిహారిక దెబ్బకు ఉడికిపోయిన హైపర్ ఆది.. అదే చాలా కష్టమంటూ బయటపెట్టేశాడుగా

Authored By
aruna
The Telugu News | Published on: August 15, 2022, 3:40 pm
Advertisement

Niharika Konidela : నిహారిక హైపర్ ఆది కాంబో బుల్లితెరపై ఎప్పుడూ హిట్టే. ఎందుకంటే నిహారిక ఎంట్రీ ఇచ్చాక ఆదికి డైలాగ్స్ ఉండవు. మామూలుగా అయితే ఆదినే అందరినీ ఆడేసుకుంటాడు. ఎదుటి వాళ్లను మాట్లాడనివ్వకుండా పంచులు వేసి పరువుతీస్తుంటాడు. ఆది కౌంటర్ల ధాటికి సరైన కౌంటర్లు ఇచ్చే వారు తగలరు. కానీ మెగా ప్రిన్సెస్ నిహారిక మాత్రం ఆది కాదు కదా? ముందు ఎవడున్నా వినదు.

Advertisement

తన స్టైల్లో ఇచ్చి పడేస్తుంటుంది. నిహారిక వేసే కౌంటర్లు అలా ఉంటాయి. పైగా మెగా డాటర్ అన్న భయంతో ఆది కూడా కాస్త వెనక్కి తగ్గుతాడు. ఇదే ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోలోనూ కనిపిస్తోంది. మామూలుగా అయితే నిహారిక జీ తెలుగు, స్టార్ మా ఈవెంట్లకు వెళ్తుంది. ఈటీవీ, మల్లెమాల ఈవెంట్లకు వచ్చి చాలా కాలమే అయింది. నాగబాబు ఇక్కడి నుంచి వెళ్లిపోయాక నిహారిక కూడా ఇటు వైపు చూడలేదు.

Niharika Konidela Punches to Hyper Aadi in Sridevi Drama Company

Advertisement

తన కొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా వచ్చినట్టుందేమో. మొత్తానికి నిహారిక మాత్రం ఆది మీద వరుసగా పంచులు వేసింది. శంకర్ దాదా స్పూప్ ట్రై చేశారు. ఈమె దాదా అంటూ, నేను ఏటీఎం అంటూ ఆది పరిచయం చేశాడు. కనిపించిన ప్రతీ అమ్మాయిని దా దా అని పిలిచి.. ఇప్పుడు నన్ను దాదా అని అంటున్నావా? అంటూ ఆది మీద నిహారిక పంచ్ వేస్తుంటుంది.

దీంతో ఆది దెబ్బకు నోర్మూసుకుంటాడు. ప్రపంచంలో అతి కష్టమైంది ఏంటి? అని ఆదిని నిహారిక అడుగుతుంది. పంచులు వేసే వాడి మీదే.. పంచులు వేస్తుంటే.. తీసుకోవడం చాలా కష్టం అంటూ తన పరిస్థితి గురించి ఆది పరోక్షంగా చెప్పేస్తాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి