Samantha : రోజూ తనకు బెడ్ మీద అది ఉండాల్సిందేనంటున్న సమంత?

Authored By Varun G | The Telugu News | Published on: October 1, 2021, 2:50 pm

Samantha సమంత రుతుప్రభు.. ఒకప్పుడు.. ఇప్పుడు సమంత అక్కినేని. తన పేరు వెనుక అక్కినేని అని తగిలించుకున్నా.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏమాత్రం సపోర్ట్ లేకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది సమంత. తను ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్. ఒక్క తెలుగే కాదు.. తమిళంలోనూ తనే సూపర్ స్టార్. రెండు భాషల్లో సినిమాల్లో నటిస్తూ.. పెళ్లి తర్వాత కూడా బిజీ అయిపోయింది.

samanth akkineni latest pics in instagram go viral

samanth akkineni latest pics in instagram go viral

ఏ హీరోయిన్ అయినా పెళ్లి తర్వాత పిల్లలు.. ఆ తర్వాత ఫ్యామిలీ కోసం తమ కెరీర్ కు బ్రేక్ ఇస్తారు లేదా కెరీర్ కు శుభం కార్డ్ వేస్తారు. కానీ.. సమంత మాత్రం తన పెళ్లి తర్వాతనే తన కెరీర్ స్పీడ్ పెంచింది. పెళ్లి తర్వాతనే తనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. బోల్డ్ గా నటించడం.. చాలెంజింగ్ పాత్రలు చేయడం కూడా పెళ్లి తర్వాతనే. ఏది ఏమైనా.. సమంతకు పెళ్లి చాలా అవకాశాలను తీసుకొచ్చిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.ఇక.. ఈ మధ్య తన గురించి చాలా గాసిప్స్ వచ్చాయి. చైతన్యతో తను విడిపోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. వాటిపై తను స్ట్రాంగ్ రిప్లయి కూడా ఇచ్చింది. దీంతో నాగ చైతన్య, సమంత మధ్య వివాదాలు ఉన్నాయి.. అనే వార్తలకు పుల్ స్టాప్ పడ్డట్టు అయింది.

samanth akkineni latest pics in instagram go viral

samanth akkineni latest pics in instagram go viral

Samantha : ఇన్ స్టాగ్రామ్ లో సమంత లేటెస్ట్ పిక్స్ వైరల్

కట్ చేస్తే.. సమంత తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. సమంత.. ఎంత ఫిట్ గా ఉంటుందో అందరికీ తెలుసు. తన ఫిట్ నెస్ రహస్యమేంటో తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ.. తన ఫిట్ నెస్ రహస్యమేంటో తన చెప్పేసింది.

samanth akkineni latest pics in instagram go viral

samanth akkineni latest pics in instagram go viral

హైప్రొటీన్ ఉన్న ఫుడ్ ను తీసుకోవడమే తన ఫిట్ నెస్ రహస్యం. అందుకే.. తన బెడ్ మీద ఖచ్చితంగా పీనట్ బటర్ ఉంటుందట. దాన్ని చూస్తేనే సామ్ కు నోరూరుతుందట. దాన్ని చేతి వేళ్లతో తీసుకొని నోట్లో వేసుకుంటే ఆ టేస్టే వేరు.. అంటూ సమంత వాటిని తింటున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు నెటిజన్లకు కూడా తెగ నచ్చుతున్నాయి. ఓహో.. సమంత ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
\

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp