Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత. ఈసినిమాలో నాగ చైతన్యకు జోడీగా నటించారు సమంత.ఇక తమిళంలో సమంత తొలిసారిగా హీరోయిన్‌గా నటించిన సినిమా బాణా కాతాడి. ఆ సినిమాలో నటుడు అధర్వ మురళికి జోడీగా నటించారు సమంత. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. యువన్ పాటలతో ఈ సినిమా వేరే లెవల్ హిట్ అయింది. ఈ సినిమా త‌ర్వాత […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 September 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత. ఈసినిమాలో నాగ చైతన్యకు జోడీగా నటించారు సమంత.ఇక తమిళంలో సమంత తొలిసారిగా హీరోయిన్‌గా నటించిన సినిమా బాణా కాతాడి. ఆ సినిమాలో నటుడు అధర్వ మురళికి జోడీగా నటించారు సమంత. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. యువన్ పాటలతో ఈ సినిమా వేరే లెవల్ హిట్ అయింది. ఈ సినిమా త‌ర్వాత స‌మంత జోరు పెంచి అద‌ర‌గొట్టింది. సౌత్ సినిమాల్లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత. 14 ఏళ్ల కెరీర్ లో సమంత ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. నటనతో పాటు చదువులో కూడా ఆమె బెస్ట్ స్టూడెంట్ అంట. అంతేకాదు స్కూల్ డేస్ లో టాప్ స్టూడెంట్ గా ఉండేది. 10వ తరగతిలో సమంత ఎన్ని మార్కులు సాధించిందో తెలిస్తే షాక్ అవుతారు.

Samantha మంచి టాలెంటెడే…

1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత తన వ్యక్తిగత, సినిమా జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన హైస్కూల్ మార్కుల షీట్ గురించి మరోసారి వార్తల్లో నిలిచింది. సమంత చదువులో ఎంత బ్రిలియంట్ స్టూడెంటో ఈ మార్కుల షీట్ చూస్తే అర్థం అవుతుంది.సమంత పదో తరగతిలో 1000 మార్కులకు గాను 887 మార్కులు సాధించింది. మ్యాథ్స్ లో 100/100 మార్కులు, ఫిజిక్స్ లో 95/100 మార్కులు సాధించింది సమంత. ఇంగ్లిష్ లో 90 మార్కులు, బోటనీలో 84 మార్కులు, హిస్టరీలో 91 మార్కులు, జాగ్రఫీలో 83 మార్కులు, లాంగ్వేజ్ పేపర్ తమిళ్ లో 88 మార్కులు వచ్చాయి.

Samantha స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

సమంత 10, 11వ మార్కుల షీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2020లో ఇదే మార్క్షీట్ వైరల్గా మారింది. వైరల్ గా మారిన రిపోర్ట్ కార్డ్ పోస్ట్ పై సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ హీరోయిన్ సమంతకు హైస్కూల్లో అంత మంచి మార్కులు రావడంతో.. ఆమె అభిమానులు ఆమెను మెచ్చుకుంటున్నారు.ఇక 2017లో నటుడు నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్నారు సమంత. వీరి వివాహం గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై సమంత – నాగ చైతన్య జంటను ఆశీర్వదించారు.వివాహం తర్వాత కూడా నటి సమంత సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ వచ్చారు. దాదాపు 4 ఏళ్లు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో 2021లో చెడు చేరింది. ఆ ఏడాదే ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది