Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత. ఈసినిమాలో నాగ చైతన్యకు జోడీగా నటించారు సమంత.ఇక తమిళంలో సమంత తొలిసారిగా హీరోయిన్‌గా నటించిన సినిమా బాణా కాతాడి. ఆ సినిమాలో నటుడు అధర్వ మురళికి జోడీగా నటించారు సమంత. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. యువన్ పాటలతో ఈ సినిమా వేరే లెవల్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత సమంత జోరు పెంచి అదరగొట్టింది. సౌత్ సినిమాల్లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత. 14 ఏళ్ల కెరీర్ లో సమంత ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. నటనతో పాటు చదువులో కూడా ఆమె బెస్ట్ స్టూడెంట్ అంట. అంతేకాదు స్కూల్ డేస్ లో టాప్ స్టూడెంట్ గా ఉండేది. 10వ తరగతిలో సమంత ఎన్ని మార్కులు సాధించిందో తెలిస్తే షాక్ అవుతారు.
1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత తన వ్యక్తిగత, సినిమా జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన హైస్కూల్ మార్కుల షీట్ గురించి మరోసారి వార్తల్లో నిలిచింది. సమంత చదువులో ఎంత బ్రిలియంట్ స్టూడెంటో ఈ మార్కుల షీట్ చూస్తే అర్థం అవుతుంది.సమంత పదో తరగతిలో 1000 మార్కులకు గాను 887 మార్కులు సాధించింది. మ్యాథ్స్ లో 100/100 మార్కులు, ఫిజిక్స్ లో 95/100 మార్కులు సాధించింది సమంత. ఇంగ్లిష్ లో 90 మార్కులు, బోటనీలో 84 మార్కులు, హిస్టరీలో 91 మార్కులు, జాగ్రఫీలో 83 మార్కులు, లాంగ్వేజ్ పేపర్ తమిళ్ లో 88 మార్కులు వచ్చాయి.
సమంత 10, 11వ మార్కుల షీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2020లో ఇదే మార్క్షీట్ వైరల్గా మారింది. వైరల్ గా మారిన రిపోర్ట్ కార్డ్ పోస్ట్ పై సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ హీరోయిన్ సమంతకు హైస్కూల్లో అంత మంచి మార్కులు రావడంతో.. ఆమె అభిమానులు ఆమెను మెచ్చుకుంటున్నారు.ఇక 2017లో నటుడు నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్నారు సమంత. వీరి వివాహం గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై సమంత – నాగ చైతన్య జంటను ఆశీర్వదించారు.వివాహం తర్వాత కూడా నటి సమంత సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ వచ్చారు. దాదాపు 4 ఏళ్లు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో 2021లో చెడు చేరింది. ఆ ఏడాదే ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.