Samantha : “నన్ను వదిలేశాక .. ఆరోగ్యం కూడా పోయింది.. కెరీర్ నాశనం ” అనుకున్న నాగ చైతన్య కి షాక్ ఇచ్చిన సమంత..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: December 27, 2022, 2:44 pm

Samantha : సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ‘ ఏ మాయ చేసావే ‘ తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సామ్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా తను ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సమంత విడాకులు తీసుకున్నాక సినిమాలో అంత సక్సెస్ కాలేదేమో అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా వరుస సినిమాలు చేస్తూ సౌత్ లోనే టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది.

సమంత కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. యశోద సినిమా షూటింగ్ దశలోనే ఆ వ్యాధికి గురైంది. అయినా షూటింగ్ పూర్తి చేసింది. సినిమా ప్రచారానికి హాజరు కాలేకపోయింది. అప్పటికి మెడికెషన్ లోకి వెళ్లిపోవడంతో వీలుపడలేదు. దీంతో సమంత ఫేస్ లో చాలా మార్పులు వచ్చాయి. అయితే నిన్న ‘ శాకుంతలం ‘ సినిమా ఫ్రీ రివ్యూ చూడడానికి సమంత వచ్చింది. ఆమె మునిపటి కంటే చాలా అందంగా కనిపించింది. మెడిటేషన్ తర్వాత బయటకు రావడం, మీడియాను కలవడం అదే తొలిసారి.

Samantha About on Naga Chaitanya

Samantha About on Naga Chaitanya

ఆమెను అక్కడ చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె అసలు సమంత కాదా అని కాసేపు ఆలోచనలో పడ్డారు. ఆమె రావడంతో ‘ శాకుంతలం ‘ సినిమా అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. నిర్మాణ పనులు ఆగిపోయాయా లేదా సినిమాను అసలే ఆపేసారా అని సందేహాలు వచ్చాయి. వీటన్నింటినీ సమంత తొలగించింది. యధావిధిగా తాను కమిట్ అయిన సినిమాలకు హాజరుకానుంది. అనారోగ్యం కారణంగా కొన్ని సినిమాలు వదులుకున్న కొన్ని సినిమాలు అలానే ఉన్నాయి. ఖుషి సినిమా సంక్రాంతి తరువాత సెట్స్ మీదకి వెళ్లనుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp