Samantha : మొదటిసారిగా జనాల ముందుకు సమంత.. ఆ ప్రశ్నలే సంధిస్తారా?

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 28 September 2021, 5:13 pm

Samantha సమంత Samantha నాగ చైతన్య విడాకులపై ఇప్పటికే కొన్ని వందల రూమర్లు, వార్తలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. చై సామ్ విడిపోతోన్నారని, ఆమెకు భరణంగా దాదాపు 300 కోట్ల ఆస్తి దక్కుతోందనే ప్రచారం కూడా ఊపులోకి వచ్చింది. మనస్పర్థల వల్లే ఇద్దరూ విడిపోతోన్నారనే టాక్ బయటకు వచ్చింది. అలా ఈ ఇద్దరి విడాకుల వ్యవహారం మీద రోజురోజుకూ రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఏ ఒక్కరూ వీటిపై ప్రత్యక్షంగా స్పందించడం లేదు.

Samantha About Saaki One Year Celebrations

Samantha About Saaki One Year Celebrations

లైవ్‌లోకి రానున్న సమంత.. Samantha

సమంత చేస్తోన్న పోస్ట్‌ల నిగూఢ అర్థాలు వేరేలా ఉంటున్నాయి. కర్మ ఫలితం అంటుంది.. నిజాన్ని ఎప్పటికీ దాచి పెట్టలేం.. నువ్ నన్ను హర్ట్ చేసి ఉండొచ్చు.. నేను నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు అనే సూక్తులను చెప్పుకుంటూ వచ్చింది. అయితే అవి చైతూతో విడాకుల గురించేనా? బ్రేకప్ గురించేనా? అనే అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి. కానీ సమంత ఎన్నడు కూడా నోరు విప్పలేదు. చివరకు తిరుమలలో దర్శనానంతరం మీడియా అడిగితే కూడా ఫైర్ అయింది.

Samantha

Samantha

బుద్ది ఉందా? అంటూ మీడియా మీద సమంత మండిపడింది. అయితే ఇన్ని రూమర్ల మధ్య సమంత జనాల ముందుకు రాబోతోంది. తన సాకీ డిజైనర్ దుస్తులు పెట్టి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రాంలో నేటి సాయంత్రం ఐదు గంటలకు లైవ్‌లోకి రాబోతోంది. అయితే జనాలు కూడా సమంత సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన ఆమెను విడాకుల వ్యవహారం మీదే ఎక్కువగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

 

samantha is going to be a mother

samantha is going to be a mother

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp