అదంతా దాని వల్లే జరిగింది.. సమంత కామెంట్స్ వైరల్

Authored By Admin | The Telugu News | Updated on: December 15, 2020, 4:02 pm

లేడీ సూపర్ స్టార్ సమంత ఎప్పటి నుంచో వస్తోన్న ఓ సంప్రదాయానికి చరమ గీతం పాడేసింది. హీరోయిన్లకు పెళ్లి అయితే కెరీర్ ముగుస్తుందని, అవకాశాలు రావని, వచ్చినా గ్లామర్ పాత్రలు చేయరని, ఏదో చిన్న చిన్న పాత్రల్లో అడ్జస్ట్ అవుతుంటారని అనుకునేవారు. కానీ సమంత వాటన్నింటిని చెరిపివేసింది. నాగ చైతన్యతో పెళ్లి తరువాత రెట్టింపు ఉత్సాహం, వేగంతో దూసుకెళ్లింది. ఎంతో మంది హీరోయిన్లకు స్పూర్తిగా నిలిచింది. ఈ విషయంపై సమంత తాజాగా స్పందించింది.

Samantha Akkineni About Luck In Her Career

Samantha Akkineni About Luck In Her Career

పెళ్లి తర్వాత కూడా వరుసగా మంచి చిత్రాల్లో నటించగలుగుతున్నానంటే..దానికీ అదృష్టమే కారణమని సమంత చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి తాజాగా ఓ టాక్‌షోలో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. కథానాయికల కెరీర్‌కి పెళ్లి అడ్డంకి కాదని నిరూపించాలనో.. ఆ అపోహను తొలగించాలనో.. నేనేమీ నా కెరీర్‌ను ప్లాన్‌ చేసుకోలేదంటూ అసలు విషయాన్ని బయట పెట్టేసింది. మామూలుగా సమంత కూడా తనకు అవకాశాలు రావనే అనుకుందట.

నిజానికి పెళ్లి తర్వాత నాకు ఇక అవకాశాలు రావనే అనుకున్నా. దానికి సిద్ధపడే పెళ్లి చేసుకున్నానని సమంత చెప్పుకొచ్చింది. కానీ, అదృష్టం నావైపు ఉంది అందుకే పెళ్లి తర్వాత ‘రంగస్థలం’ వచ్చిందని సమంత గర్వంగా చెప్పుకుంది. ‘మహానటి’ లాంటి గొప్ప సినిమా చేశా. ‘ఓ బేబీ’తో మెప్పించా. ఇంకా అద్భుతమైన పాత్రలు పోషించగలుగుతున్నా. ఇందతా నాకు దొరికిన అదృష్టమనే చెప్పాలంటూ పూర్తిగా లక్ మీదే నెట్టేసింది సమంత. అంటే సమంతను అదృష్టం నీడలా వెంటాడుతోందన్న మాట.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp