Samantha : సమంతలో ఈ మ్యాటర్ కూడా ఉందా.. ఈ ఫోటో చూస్తే అలానే అనిపిస్తోంది ..!!
Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడ్డ ఫలితం మాత్రం దక్కలేదు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో సమంతను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇంత పెద్ద సినిమా ఫ్లాఫ్ అయినా సమంతకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది.
ప్రస్తుతం సమంత బాలీవుడ్లో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇక టాలీవుడ్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ ఖుషి ‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని కొత్త షెడ్యూల్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది అంటూ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేసింది. రాత్రంతా షూటింగ్ పగలంతా పార్టీ ఖుషి షూటింగ్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం గ్వాలియర్ నుంచి కేరళకు వెళ్తున్నాము అంటూ ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేసింది దీనికి తోడుగా ఒక ఫోటోను కూడా పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలో సమంత చాలా నాటీ లుక్స్ లో కనిపించింది. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇటీవల విడుదలైన ‘ ఖుషి ‘ సినిమా ప్రోమో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై సమంత అభిమానులు రౌడీ స్టార్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కచ్చితంగా ఖుషి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరీ ఖుషి సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.