murali mohan gives clarity about Samantha Naga Chaitanya divorce
Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ నాగ చైతన్య మరియు సమంత విడిపోతున్నట్లుగా ప్రకటించిన వెంటనే అభిమానులు అంతా కూడా షాక్ అయ్యారు. వారి విడాకులు నిజం అవ్వద్దు అంటూ దేవుళ్లను కూడా ప్రార్థించారు. ఇద్దరు విడి పోయినట్లుగా ప్రకటించిన తర్వాత కూడా మళ్లీ వారు ఇద్దరు కలిస్తే బాగుండు అనుకున్నారు. కాని అది సాధ్యం అయ్యే అవకాశం లేదు. అయినా కూడా అభిమానులు ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. గతంలో విడిపోయిన వారు మళ్లీ కలవడం జరిగింది. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ మరియు ఆయన భార్య విడాకులు తీసుకున్నా కూడా మళ్లీ కలిసి పోయారు. ఇద్దరు ప్రస్తుతం సహజీవనం సాగిస్తున్నారు అనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. కనుక సమంత మరియు నాగ చైతన్యలు కూడా అలా కలవక పోతారా అంటూ కొందరు ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో రెండు కారణాలు వాళ్లు మళ్లీ కలుస్తారని నమ్మకం కలిగిస్తున్నాయి అంటూ అభిమానులు చెబుతున్నారు. మొదటిది నాగ చైతన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ లో బెస్ట్ పెయిర్ ఎవరు అంటే సమంత అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఖచ్చితంగా సమంతపై చైతూకు ఉన్న ప్రేమను చూపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత అంటే ఇప్పటికి కూడా చైతూకు ప్రేమ ఉంది. అందుకే ఆమె పేరును చెప్పాడు. ఆ ప్రశ్నను స్కిప్ చేయవచ్చు లేదంటే ఆ ప్రశ్నకు మరో సమాధానం అయినా చెప్పవచ్చు. కాని నాగచైతన్య ఆమె పేరును చెప్పడంతో ఇంకా ప్రేమలోనే ఉన్నాడు చైతూ అంటూ సమంతను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
samantha and naga chaitanya fans again thinking they are in love
నాగచైతన్య ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తు అయితే తాజాగా నాగ చైతన్య తో బ్రేకప్ విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ ఒక పోస్ట్ ను పెట్టింది. ఆ పోస్ట్ ను తాజాగా డిలీట్ చేసింది. దాంతో సమంత తన నిర్ణయాన్ని మార్చుకుందేమో అంటూ కొందరు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. మొత్తానికి సమంత ఆ పోస్ట్ ను డిలీట్ చేయడంతో పాటు నాగ చైతన్య అలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా కూడా ఖచ్చితంగా వీరిద్దరు మళ్లీ కలుస్తారేమో అంటూ ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరు కలిసి మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి.. ఇద్దరు సంసార జీవితం సంతోషంగా ఉండాలంటూ ప్రతి ఒక్కరు ఆశ పడుతున్నారు. కాని అది సాధ్యం అయ్యేది కాదు.. ఒక వేళ వీరిద్దరు కలిస్తే మాత్రం ఒక అద్బుతం అవుతుంది అనడంలో సందేహం లేదు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.