Home » Entertainment » Samantha Anger On Naga Chaitanya
Entertainment

Samantha : కనీసం ఆ పని కూడా చేయని సమంత.. నాగచైతన్య అంటే అంత కోపమా..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 24, 2021, 12:45 pm
Advertisement

Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి అందరికీ విదితమే. విడిపోయిన తర్వాత కూడా సమంత, నాగచైతన్య సోషల్ మీడియాలో వార్తల్లో ఉన్నారు. సమంత సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలు, ఇతర అంశాలపై స్పందిస్తున్నది. ఇకపోతే నాగచైతన్య కూడా తన సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టేసి తన ఫిల్మ్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తున్నారు. కాగా, తాజాగా సమంత చేసిన ఓ పని ద్వారా ఆమెకు నాగచైతన్య అంటే ఎంత కోపమున్నదో అర్థమవుతున్నదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. డైవోర్స్ తర్వాత నాగచైతన్య, సమంత ఇద్దరూ తమ సినిమా కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టేశారు.

Advertisement

వరుస సినిమాలు చేసేందుకుగాను సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడతున్నాయి. సమంత ‘శాకుంతలం, కాతు వాకుల రెండు కాదల్’ చిత్రాల షూటింగ్ పూర్తి చేసింది. త్వరలో ఓ ఐటెం సాంగ్ చేయబోతున్నది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో బన్నీకి జోడీగా ఓ ఐటెం సాంగ్ చేయబోతున్నది. ఈ సంగతులు అలా ఉంచితే..సమంత చేసిన పని నెట్టింట చర్చనీయాంశమవుతున్నది. నాగచైతన్య బర్త్ డే నవంబర్ 23 అనగా బుధవారం.. కాగా, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్కినేని వారి అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. టాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల ప్రముఖులు, ఫ్రెండ్స్ కూడా విషెస్ చెప్పారు.

samantha anger on naga chaitanya

Advertisement

Samantha : విడాకుల విషయం నుంచి బయటపడుతున్న సమంత, నాగచైతన్య..

నాగచైతన్య నటిస్తున్న చిత్రాలు ‘థాంక్యూ, బంగార్రాజు’ మూవీస్ మేకర్స్ కూడా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేసి విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే నాగచైతన్యకు ఆయన మాజీ భార్య సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుందని అందరూ ఆశించారు. కానీ, ఆమె చెప్పలేదు. డైవోర్స్ తీసుకున్న సందర్భంలో తాము విడిపోతున్నప్పటికీ ఫ్రెండ్స్‌గా కలిసే ఉంటామని చెప్పిన సమంత..ఎందుకు బర్త్ డే విషెస్ చెప్పలేదని పలువురు నెటిజన్లు అడుగుతున్నారు. ఈ విషయాన్ని బట్టి నాగచైతన్య అంటే సమంతకు ఎంత కోపమో అర్థమవుతున్నదని అంటున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి