Samantha : ఇదేంటి స‌మంత.. కుక్క‌ల‌తో జిమ్ వ‌ర్కౌట్స్ ఏంటి..?

Authored By mallesh | The Telugu News | Published on: February 9, 2022, 7:32 pm

Samantha :అదేంటో గానీ.. ఈ న‌డుమ స‌మంత చాలా ఎక్కువగా వార్త‌ల్లో నిలుస్తోంది. ఆమె ఏం చేసినా స‌రే త్వ‌ర‌గానే నెట్టింట్లో వైర‌ల్ కావ‌డంతో మీడియా కూడా బాగానే క‌వ‌ర్ చేస్తోంది. చైత‌న్య‌తో విడిపోయిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియా ఆమె చుట్టే తిరుగుతోంది. కాగా స‌మంత ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా త‌న ఫ్యాన్స్‌కు ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు సంబంధించి విష‌యాల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూనే ఉంటుంది.అయితే ఫిట్ నెస్ విష‌యంలో స‌మంత చాలా కమిట్ మెంట్ తో ఉంటుంది. నిత్యం జిమ్ లో వ‌ర్కౌట్స్ చేస్తూ.. క‌ష్ట‌త‌ర మైన ఫీట్లు కూడా చాలా ఈజీగా చేసేస్తుంది స‌మంత‌. వ‌ర్కౌట్స్‌కు సంబంధించి స‌మంత ఏ పోస్టు చేసినా స‌రే క్ష‌నాల్లోనే వైర‌ల్ అయిపోవ‌డం కామ‌న్‌. ఇప్పుడు కూడా ఇలాంటి పోస్టు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

samantha are gym workouts with dogs

samantha are gym workouts with dogs

Samantha : ఎక్క‌డ‌కు వెళ్లినా అవి వెంటే..

అయితే ఉద‌యాన్నే స‌మంత వ‌ర్కౌట్స్ చేస్తున్న‌ట్టు మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తుంది. ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే.. స‌మంత త‌న పెంపుడు కుక్క‌ల‌ను ప‌క్క‌న పెట్టుకుని మ‌రీ వ‌ర్కౌట్స్ చేస్తుంది. ఆ రెండు కుక్క‌లు కూడా ఆమె చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. అంటే చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత ఎక్క‌డ‌కు వెళ్లినా ఒంటరిత‌నం ఫీల్ కాకుండా వాటితో టైమ్ పాస్ చేస్తోంద‌ని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp