Home » Entertainment » Samantha Baby Elephant Reunited
Entertainment

Samantha : ఆ విషయంలో ఎంతో సంతోషంగా ఉందట.. ఫుల్ ఖుషీ అయిన సమంత

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 8, 2021 12:26 pm
Advertisement

Samantha సమంత ప్రస్తుతం మళ్లీ తన నార్మల్ లైఫ్‌ను ప్రారంభించాలని ఫిక్స్ అయింది. అందుకు విడాకుల విషయాన్ని ఇక పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నట్టుంది. అందుకే ఇక తన డెయిలీ రొటీన్ పనులను ప్రారంభించింది. ఇందులో భాగంగా సమంత షూటింగ్‌లకు హాజరు అయినట్టు తెలుస్తోంది. ఓ యాడ్ షూట్, బుల్లితెరపై మరో షోలో గెస్టుగా పాల్గొందట. ఎన్టీఆర్ హోస్ట్‌గా వస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోలో సమంత పాల్గొందట. దాదాపు 25 లక్షలు గెలుచుకుందని తెలుస్తోంది.

Advertisement

Samantha Baby Elephant Reunited

అయితే సమంత గెలుచుకున్న ఆ మొత్తం తన ఫౌండేషన్‌కు ఇచ్చి ఉంటుంది. అలా సమంత మొత్తానికి షూటింగ్‌లతో తన పర్సనల్ లైఫ్‌ను మరిచిపోవాలని ఫిక్స్ అయింది. సోషల్ మీడియాలోనూ మునుపటిలానే ఫుల్ యాక్టివ్‌గా ఉండాలని ఫిక్స్ అయింది. మామూలుగానే సమంత జంతు ప్రేమికురాలు. తన ఇంట్లో ఇప్పటికే రెండు పెట్స్ ఉన్నాయి. అందులో హష్ అంటూ చై సామ్‌లకు బాగా ఇష్టం. కానీ ఇప్పుడు ఆ హష్‌ను తనతో పాటే ఉంచుకుంటోంది సమంత.

Advertisement

Samantha : దారి తప్పిన ఏనుగు వీడియోపై సమంత..

Samantha And Sadhna Singh Conversation

జంతు ప్రేమికులందరికీ నిన్న ఓ వీడియో చూసి కడుపు నిండిపోయి ఉంటుంది. ఓ పిల్ల ఏనుగు తప్పిపోయింది. దాన్ని అధికారులు దాని తల్లి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పగించారు. తల్లిబిడ్డలను కలిపారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన, ఆ ఏనుగుల ప్రేమను చూసి అందరూ మురిసిపోయారు. ఇక సమంత కూడా తెగ ఎమోషనల్ అయింది. వాటి ప్రేమను చూసి మురిసిపోయింది. తన ఇన్ స్టా స్టోరీలో ఆ వీడియోను షేర్ చేసింది. ఎంతో సంతోషమేస్తోందన్నట్టుగా ఎమోజీలను షేర్ చేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి