samantha bounce back every time when career is in risk
Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కెరియర్ లో వెనకపడ్డ ప్రతిసారి మళ్లీ నూతన ఉత్సాహంతో వస్తుంది. స్టార్ హీరోల సరనన నటిస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు మధ్యలో కొన్నాళ్లు కెరియర్ గ్రాఫ్ డౌన్ అయ్యింది. ఇక నాగ చైతన్య తో ప్రేమాయణం వల్ల మళ్లీ వార్తల్లో నిలిచిన సమంత చైతుని పెళ్లాడి కెరియర్ సక్సెస్ చేసుకుందని అనుకున్నారు. పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ కైనా సినీ కెరియర్ ముగుస్తుంది కానీ సమంత పెళ్లైనా సరే సినిమాలు చేస్తూ వచ్చింది. పెళ్లై హ్యాపీగా ఉన్నారనుకున్న చైతు, సమంతలు సడెన్ గా డైవర్స్ అంటూ షాక్ ఇచ్చారు.
ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధల కారణంగానే ఈ డైవర్స్ జరిగాయని.. సమంత శృతిమించి గ్లామర్ షో చేయడం అక్కినేని ఫ్యామిలీ పరువు తీసినట్టు అవుతుందని అందుకే విడాకులు తీసుకోక తప్పలేదని అన్నారు. ఏది ఏమైనా ముచ్చటగా ఉన్న జంట కాస్త ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ టైం లో సమంత మళ్లీ కెరియర్ పుంజుకుంటుందని అసలు ఊహించరు. కానీ మళ్లీ ఎంత వెనక్కి తగ్గితే అంత ఫోర్స్ తో ముందుకు దూసుకొస్తుంది సమంత. ఆఫ్టర్ డైవర్స్ సినిమా ఛాన్సులు కూడా అందుకుంటుంది. ప్రస్తుతం శాకుంతలం, యశోద సినిమాలు చేస్తున్న సమంత ఆ సినిమాలతో మళ్లీ తన సత్తా ఏంటన్నది చూపించబోతుంది. అంతెందుకు శాంపిల్ గా వచ్చిన యశొద ట్రైలర్ చూస్తేనే సమంత మరోసారి సిల్వర్ స్క్రీన్ పై తన మ్యాజిక్ చూపిస్తుందని అర్ధమవుతుంది.
samantha bounce back every time when career is in risk
తన లైఫ్ లో జరిగే ప్రతి విషయంలో ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారో అంతేమంది ఎగతాళి కూడా చేస్తూ వచ్చారు.. అయినా సరే వెనకబడ్డ ప్రతిసారి ఎగసిపడే ఉప్పెనగా సమంత దూసుకొస్తుంది. ఇలా ఏ హీరోయిన్ కి జరగలేదు. ఏ హీరోయిన్ సాధించని రేర్ ఫీట్ ఇదని చెప్పొచ్చు. ఇక రాబోతున్న రెండు సినిమాలు హిట్టైతే అమ్మడి రేంజ్ మరోసారి అందరికి తెలుస్తుందని చెప్పొచ్చు. అక్కినేని ఇంట కోడలిగా వెళ్లి.. ఆ తర్వాత డైవర్స్ తీసుకుని మళ్లీ తను ఇంత స్ట్రాంగ్ గా నిలబడటానికి చాలా త్గట్స్ ఉండాలి. మనసుకి తగిలిన గాయానికి కొంత టైం తీసుకున్నా అదే ఉత్సాహంతో పనిచేయడం ఆడియన్స్ ని అలరించడం అన్నది కేవలం సమంత వల్లే సాధమైదని చెప్పొచ్చు. ఈ విషయంలో ఆమె ఎంతోమందికి స్పూర్తిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.