Shoaib Akhtar : ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ మంచి మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. సెమీస్‌కి వెళ్లడానికి ఇంకెంత దూరం లేదు. అయితే భారత్ విజయాలని భరించలేకపోతున్న షోయబ్ అక్తర్ అక్కసు వెళ్లగక్కాడు. . టోర్నీలో రెండు విజయాలు సాధించిన టీమిండియాకు టైటిల్ గెలిచే సీన్ లేదని, సెమీస్‌లో ఓడి ఇంటి దారి పట్టడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. మెగాటోర్నీలో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్‌పై గెలుపొందింది. ఇక మిగిలిన మ్యాచుల్లో సౌతాఫ్రికా గండాన్ని దాటితే… బంగ్లా, జింబాబ్వేలపై మ్యాచులు గెలిస్తే సరిపోతుంది. సఫారీలతో ఓడినా టీమిండియా సెమీస్ బెర్త్‌కు వచ్చే నష్టం ఏం లేదు.
షోయబ్ అక్తర్ మాత్రం తన అక్కసు వెళ్లగక్కడం హట్ టాపిక్‌గా మారింది. బాబర్ ఆజమ్ చేతకాని కెప్టెన్ అని, వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ నిష్ర్కమించినట్టేనని వ్యాఖ్యానించాడు. అయితే అంతటితో ఆగకుండా చక్కటి ప్రదర్శన చేస్తున్న భారత్ జట్టుపైనా అతి అంచనా వేశాడు. వరల్డ్ కప్ నుంచి భారత్ వచ్చేవారమే ఇంటికి తిరిగొస్తుందని అన్నాడు. సెమీ-ఫైనల్స్ నుంచి నిష్క్రమిస్తుందని పేర్కొన్నాడు. ‘‘ ఈ వారమే పాకిస్తాన్ ఇంటికొస్తుందని ముందే చెప్పాను. అదే జరగబోతోంది. ఇండియా కూడా అంతే. వచ్చేవారమే ఇంటికొస్తుంది. సెమీ-ఫైనల్స్ ఆడి తిరిగొచ్చేస్తారు. భారతేమీ తీస్‌మార్ ఖాన్ జట్టు కాదు. పాక్‌తో సమానమే’’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు.
బాబర్ బ్యాటింగ్ ఆర్డర్‌తో సహా పాకిస్థాన్ పలు విషయాలపై దృష్టి పెట్టాలని అక్తర్ సూచించాడు. “బాబర్ వన్ డౌన్ బ్యాటింగ్ చేయాలి. షాహీన్ షా అఫ్రిది ఫిట్‌నెస్‌లో ప్రధాన లోపం. కెప్టెన్సీలో కూడా లోపం ఉంది” అని చెప్పాడు. ఈ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మీరు మ్యాచులేం గెలుస్తారు. పాక్‌కి ఓ చెత్త కెప్టెన్ దొరికాడు. రెండో గేమ్‌లోనే పాకిస్తాన్, వరల్డ్ కప్ నుంచి నిష్కమించింది. మరీ జింబాబ్వేతో మ్యాచ్ ఓడిపోతారని ఎవరు మాత్రం అనుకుంటారు. ఫకార్ జమాన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చెబెడుతున్నారు. అతని అనుభవాన్ని వాడుకోవడం లేదు.పాకిస్థాన్ తన తదుపరి సూపర్ 12 మ్యాచ్‌లో ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక పరుగు తేడాతో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్‌మెంట్‌లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
This website uses cookies.