Samantha : నేను త‌ల్లిని కావాల‌ని అనుకుంటున్నాను..ఆల‌స్యం కాలేదంటున్న స‌మంత‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : నేను త‌ల్లిని కావాల‌ని అనుకుంటున్నాను..ఆల‌స్యం కాలేదంటున్న స‌మంత‌

 Authored By ramu | The Telugu News | Updated on :11 November 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : నేను త‌ల్లిని కావాల‌ని అనుకుంటున్నాను..ఆల‌స్యం కాలేదంటున్న స‌మంత‌

 

Samantha : టాలీవుడ్ Tollywood  గ్లామ‌ర్ బ్యూటీ స‌మంత ఎప్పుడు ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. దాదాపు ఏడాది గ్యాప్‌ తర్వాత సమంత తెరపై కనిపించింది. అది వెండి తెర మీదు కాదు బుల్లితెరపై. ‘సిటడెల్‌: హనీ బన్నీ’ సిరీస్‌తో  Citadel Honey Bunny ఇటీవల ప్రేక్షకులను పలకరించింది సామ్‌. ఎంతోకాలంగా వెయిట్‌ చేస్తున్న ఈ సిరీస్‌ ఈ నెల ఏడో తేది నుంచి అమెజాన్‌ ఫ్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్‌ సాధించిన సక్సెస్‌ పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇదే వేదికపై ఆమె పలు అంశాల గురించి మాట్లాడారు. ఇక నాగ చైతన్యతో డైవర్స్ అయినా తర్వాత తన మాతృత్వం గురించి మాట్లాడారు సమంత.

Samantha తల్లి కావాల‌ని ఉంది..

తాజాగా సమంత ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ Bollywood Media మీడియాతో మాట్లాడింది. అయితే సిటాడెల్ సిరీస్ లో సమంత ఓ బాలికకు తల్లిగా కూడా నటించింది. దీంతో అమ్మతనం గురించి, తల్లిగా నటించారు దాని ఫీల్ ఎలా ఉంది, తల్లిగా ఉండటం మిస్ అవుతున్నారా అనే ప్రశ్న సమంతకు ఎదురైంది. దీనిపై సమంత ఆసక్తికర సమాధానమిచ్చింది.తనకు కూడా తల్లిని కావాలనే కోరిక ఉందని, కలలు ఉన్నాయని, అమ్మగా ఉండటానికి బాగా ఇష్టపడతానని సమంత చెప్పారు. అయితే ఇందుకు బాగా ఆలస్యమైందని మాత్రం తాను అనుకోవడంలేదని, జీవితంలో ప్రస్తుతం తాను చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నానని చెప్పింది.

Samantha నేను త‌ల్లిని కావాల‌ని అనుకుంటున్నానుఆల‌స్యం కాలేదంటున్న స‌మంత‌

Samantha : నేను త‌ల్లిని కావాల‌ని అనుకుంటున్నాను..ఆల‌స్యం కాలేదంటున్న స‌మంత‌

నిజ జీవితంలో తల్లిని కావాలనే కోరిక ఉందని సమంత చెప్పడం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్నిబట్టి సమంత రెండోపెళ్లి చేసుకోబోతున్నట్లుగా ముందే చెప్పిందని, అందుకు హింట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై చర్చ నడుస్తోంది.మరి నాగచైతన్య రెండో పెళ్ళికి రెడీ అయినట్టు సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకొని తల్లి అవుతుందా లేక సరోగసి పద్దతిలో తల్లి అవుతుందా లేదా ఎవర్నైనా దత్తత తీసుకుంటుందా చూడాలి మరి.ఇటీవలే సమంత మాట్లాడుతూ తాను ఒంటరిగా ఉండాలని అనుకోవడంలేదని, త్వరలోనే మీకు ఆ విషయం తెలుస్తుందని ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సంఘటనలనుబట్టి, సమంత వ్యాఖ్యలను బట్టి రెండోపెళ్లికి గట్టిగా సిద్ధపడి ఉందని, అతనెవరనేది త్వరలోనే తేలుతుందని స‌మాచారం.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది