Naga Chaitanya is Samantha taking care of her memories
Samantha : అక్టోబర్ 2న నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. బ్రేకప్ తర్వాత సమంత మాత్రమే తమ మధ్య జరిగిన విషయాల గురించి ప్రస్తావిస్తుంది తప్ప చైతూ ఏ మాత్రం స్పందించడం లేదు. చైతూ ఈ విషయంపై మళ్లీ మాట్లాడటానికి సిద్ధంగా లేదని ‘థాంక్యూ’ ప్రమోషన్స్ లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలను అవైడ్ చేయడాన్ని బట్టి అర్థం అవుతుంది. అయితే సామ్ గురించి తెలిసినవాళ్ళు మాత్రం కచ్చితంగా ఆమె ఈ ఇష్యూ మీద సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతుందని భావించారు. నాగ చైతన్య పేరు తీసుకురాకుండానే ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ మూడవ ఎపిసోడ్ లో సమంత తన విడాకుల గురించి మరియు విడిపోయిన తర్వాత జీవితం గురించి సమాధానమిచ్చింది.
‘నువ్వు నీ హస్బెండ్ విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత..’ అని కరణ్ జోహార్ అడుగుతుండగా.. సామ్ మధ్యలో కలుగజేసుకొని ‘ఎక్స్ హస్బెండ్’ అని సూచించింది. ఆ సందర్భంలో సమంత దగ్గినట్లు గొంతు సవరించుకోవడాన్ని గమనించవచ్చు. దీంతో కరణ్ సారీ చెబుతూ ప్రశ్నను కంటిన్యూ చేశారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు ఎక్కువగా ఉంచారు? దాని వల్లే మీపై ఎక్కువ ట్రోలింగ్ జరిగిందని అనుకుంటున్నావా? అని ఆమెను అడిగాడు. ప్రేక్షకులు ఎల్లప్పుడూ తన జీవితంలో భాగమే కాబట్టి.. తాను పబ్లిక్ డొమైన్ లో ఆ విషయాన్ని ఉంచానని సామ్ బదులిచ్చింది.
samantha comments about Naga Chaitanya
పారదర్శకంగా ఉండాలని ఆ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపింది. మీ ఇద్దరి మధ్య ఏమైనా హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా అని కరణ్.. సమంతను మరో ప్రశ్న వేశాడు. దీనికి సమంత షాకింగ్ సమాధానం ఇచ్చింది. మీరు నన్ను నాగచైతన్యను ఒకే గదిలో వేసినట్లయితే.. ఆ గదిలో పదునైన వస్తువులు ఏవీ లేకుండా చూసుకోవాలి అని కరణ్‌కు సమాధానం చెప్పింది. ప్రస్తుతం… తనకు చైకు మధ్య పరిస్థితులు అలాగే ఉన్నాయని.. భవిష్యత్తులో అవి మారవచ్చు అని సమంత పేర్కొంది. ఇక సమంత తనను ఎక్కువగా వ్యక్తిగత ప్రశ్నలు వేయొద్దంటూ కరణ్ జోహార్‌ను కోరింది.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.