Samantha : నేను ఫీల్ అవ్వడానికి ఇష్టపడతాను.. నువ్వు ఫీలయ్యేలా చెయ్యి అంటూ సమంత కామెంట్
Samantha : అక్కినేని నాగ చైతన్యతో నాలుగేళ్ల వైవాహిక జీవితం గడిపిన సమంత అనూహ్యంగా అక్టోబర్ 2, 2021న విడాకులు ఇచ్చింది. వీరిద్దరి విడాకుల వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడాకుల తర్వాత సమంత చాలా డల్ అయింది. తాను చనిపోవాలని అనుకున్నట్టుగా కూడా పేర్కొంది. ఇప్పుడిప్పుడే గత జ్ఞాపకాలు మరచిపోతూ సాధారణ జీవితం గడుపుతున్న సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర పోస్ట్‌లు పెడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా గోవా వెళ్లి వచ్చింది. అక్కడ బికినీలో ఈ ముద్దుగుమ్మ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బికినీలో రచ్చ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక రీసెంట్‌గా తన ఫ్రెండ్స్ అయిన వెన్నెల కిషోర్ , రాహుల్ రవీంద్రన్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనికింద మీరు లేకుండా నేనేం చేయగలను మిత్రమా అంటూ కామెంట్ కూడా షేర్ చేసింది.

Samantha comments post topic
Samantha : బికినీలో రెచ్చిపోయి అందాలు ఆరబోత ..
ఇక తాజాగా ప్రకృతికి సంబంధించిన పిక్ షేర్ చేయగా, అందులో సూర్యోదయానికి సంబంధించిన ఫొటో ఉండగా, దానికి నేను గుడ్ థింగ్స్ ను ఫీల్ అవ్వడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు కూడా గుడ్ థింగ్స్ ను ఫీల్ అయ్యేలా చెయ్యి అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వెనక అర్ధమేంటా అని అందరు ఆరాలు తీస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆ మధ్య శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం యశోద అనే సినిమా చేస్తుంది. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తైంది. త్వరలో మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు.