Samantha : డైరెక్ట‌ర్స్‌కి ఆ మెలిక పెట్టి చుక్క‌లు చూపిస్తున్న స‌మంత‌.. ఎందుక‌మ్మ‌డు ఇలా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : డైరెక్ట‌ర్స్‌కి ఆ మెలిక పెట్టి చుక్క‌లు చూపిస్తున్న స‌మంత‌.. ఎందుక‌మ్మ‌డు ఇలా?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి త‌న ఆరోగ్యంపై దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. మ‌యోసైటిస్ కారణంగా కొన్నాళ్ల నుండి సినిమాల‌కి దూరంగా ఉంటుంది స‌మంత‌. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా నిర్వ‌హిస్తుంది. ఇందులో త‌న ఆరోగ్యంతోపాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. నేను ఉదయం 5:30 గంటలకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : డైరెక్ట‌ర్స్‌కి ఆ మెలిక పెట్టి చుక్క‌లు చూపిస్తున్న స‌మంత‌.. ఎందుక‌మ్మ‌డు ఇలా?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి త‌న ఆరోగ్యంపై దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. మ‌యోసైటిస్ కారణంగా కొన్నాళ్ల నుండి సినిమాల‌కి దూరంగా ఉంటుంది స‌మంత‌. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా నిర్వ‌హిస్తుంది. ఇందులో త‌న ఆరోగ్యంతోపాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. నేను ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాను. లేవగానే జర్నలింగ్ తో నా రోజును ప్రారంభిస్తాను. గ్రాటిట్యూడ్‌ జర్నల్ రాస్తాను. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు సూర్య కిరణాలను ఆస్వాదిస్తాను.అనంత‌రం బ్రీత్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తాను. ఇందు కోసం నేను విమ్‌ హోఫ్ మెథడ్ ఫాలో అవుతాను. నేను గత కొంతకాలంగా ఇషా క్రియా కూడా చేస్తున్నాను. 25 నిమిషాల పాటు మెడిటేషన్ కూడా చేస్తాను.

Samantha : స‌మంత చుక్క‌లు చూపిస్తుందిగా..

అలాగే కొద్ది నెలలుగా టాపింగ్‌ చేయడం వంటివి కూడా చేస్తున్నాను. ఇలా చేయ‌డం వ‌ల‌న ఎన‌ర్జీ బ్యాలెన్స్ చేయ‌డానికి ఎంతో సాయం అవుతుంది. పెయిన్స్ నుండి రిలీఫ్ ఉంటుంది అని స‌మంత చెప్పుకొచ్చింది.స‌మంత ప్ర‌స్తుతం అనారోగ్యం నుండి పూర్తిగా కొలుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో తిరిగి సినిమాలు చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటుంది. మంచి మంచి క‌థ‌ల‌ని ఎంచుకుంటున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇప్పుడు ద‌ర్శ‌కుల‌కి స‌మంత కొన్ని కండీషన్స్ పెడుతుంద‌ట‌.క‌మర్షియ‌ల్ చిత్రాల‌లో తాను మెయిన్ లీడ్ అయితే చేస్తాన‌ని స‌మంత అంటుంద‌ట‌. సెకండ్ హీరోయిన్ అయితే చేసే ప్ర‌సక్తే లేద‌ని అంటుంద‌ట‌. స‌మంత క్రేజ్ ఇప్పుడు కాస్త త‌గ్గిన స‌మ‌యంలో కూడా ఇప్పుడు ఆమె ఇలాంటి కండీష‌న్స్ పెట్ట‌డం ఏంట‌ని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Samantha డైరెక్ట‌ర్స్‌కి ఆ మెలిక పెట్టి చుక్క‌లు చూపిస్తున్న స‌మంత‌ ఎందుక‌మ్మ‌డు ఇలా

Samantha : డైరెక్ట‌ర్స్‌కి ఆ మెలిక పెట్టి చుక్క‌లు చూపిస్తున్న స‌మంత‌.. ఎందుక‌మ్మ‌డు ఇలా?

ఇక స‌మంత త్వ‌ర‌లో సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప‌ల‌క‌రించ‌నుంది. దీంతో స‌మంత నేష‌న‌ల్ వైడ్‌గా మరింత పాపులారిటీ పెంచుకోవాల‌ని అనుకుంటుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. యశోద, శాకుంతలం తర్వాత సమంత విజయ్‌ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాను చేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా విడుదలై సోసో అనిపించుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది