Prabhas : ప్రభాస్ తో నేను పెట్టుకోను .. భయపడుతున్న స్టార్ హీరో

Prabhas : ప్రభాస్ తో నేను పెట్టుకోను .. భయపడుతున్న స్టార్ హీరో

 Authored By sudheer | The Telugu News | Updated on :29 January 2026,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas : ప్రభాస్ తో నేను పెట్టుకోను .. భయపడుతున్న స్టార్ హీరో

Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంటుంది. గతంలో 2023 డిసెంబరులో షారుఖ్ ఖాన్ ‘డంకీ’, ప్రభాస్ ‘సలార్’ చిత్రాలు తలపడినప్పుడు ఇలాంటి పరిస్థితే కనిపించింది. ‘పఠాన్’, ‘జవాన్’ వంటి భారీ విజయాలతో జోరు మీదున్న షారుఖ్, ప్రభాస్ క్రేజ్ ముందు నిలవలేకపోయారు. ‘సలార్’ బ్లాక్ బస్టర్ టాక్‌తో సుమారు 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించగా, ‘డంకీ’ కేవలం 400 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లో కూడా ప్రభాస్ ప్రభావాన్ని తట్టుకోలేక షారుఖ్ బాక్సాఫీస్ పంచ్ తిన్నారని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.

Prabhas ప్రభాస్ తో నేను పెట్టుకోను భయపడుతున్న స్టార్ హీరో

Prabhas : ప్రభాస్ తో నేను పెట్టుకోను .. భయపడుతున్న స్టార్ హీరో

Prabhas : స్పిరిట్’ భయంతో ‘కింగ్’ వెనక్కి

అదే పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో షారుఖ్ ఖాన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ చిత్రం 2027 మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. తొలుత షారుఖ్ ఖాన్ తన ‘కింగ్’ చిత్రాన్ని కూడా అదే సమయానికి విడుదల చేయాలని భావించారు. అయితే, ప్రభాస్-సందీప్ వంగా మాస్ కాంబినేషన్ సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించిన షారుఖ్, తన సినిమాను మూడు నెలల ముందుకు జరుపుతూ 2026 డిసెంబరు క్రిస్మస్ రేసులోకి తీసుకువచ్చారు. హాలీవుడ్ భారీ చిత్రం ‘అవెంజర్స్’తో తలపడటానికైనా సిద్ధపడ్డారు కానీ, ప్రభాస్ ‘స్పిరిట్’ సునామీకి అడ్డుగా నిలబడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Prabhas  : షారుక్ ‘సేఫ్ గేమ్’

డిసెంబరు నెల షారుఖ్ ఖాన్‌కు సెంటిమెంట్ పరంగా బాగా కలిసివచ్చే మాసం కావడంతో, ఈ ప్రీపోన్ నిర్ణయం ఆయనకు లాభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘కింగ్’ సినిమాతో షారుఖ్ తనయ సుహానా ఖాన్ కూడా వెండితెరకు పరిచయం అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ క్రేజ్‌ను గౌరవిస్తూ లేదా భయపడుతూ షారుఖ్ తీసుకున్న ఈ ‘సేఫ్ గేమ్’ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అటు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మా అన్న దెబ్బకు బాలీవుడ్ బాద్‌షా కూడా రూటు మార్చుకున్నాడంటూ నెట్టింట సందడి చేస్తున్నారు.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది