Samantha : ఈ సారి మ‌రింత జోష్‌తో .. ఊ అంటావా మావ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేసిన స‌మంత‌.. వైర‌ల్ వీడియో

Authored By Sam C | The Telugu News | Published on: January 6, 2022, 4:20 pm

Samantha : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప ది రైజ్‌’. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌తి సాంగ్ శ్రోత‌ల‌ని ఎంత‌గానో అల‌రించింది. ముఖ్యంగా ఊ అంటావా మావ పాట‌కు కుర్ర‌కారు ఊగిపోయారు. చంద్ర‌బోస్ సాహిత్యం, ఇంద్రావ‌తి గానం, స‌మంత డ్యాన్స్ ఈ సాంగ్‌కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ పాట‌లో సాహిత్యం మ‌గ‌వారిని కించ‌ప‌రిచేలా ఉందంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమ‌రావ‌తిలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన పురుషుల సంఘం ఈ పాట‌ను తొల‌గించాలంటూ కేసు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ సాంగ్ ఇప్ప‌టికీ ట్రెండింగ్ లో ఉండ‌గా స‌మంత త‌న సాంగ్‌కి తానే డ్యాన్స్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షంచింది. డ్యాన్స్ రూంలో త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఊ అంటావ అనే పాట‌కు అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది. టైట్ దుస్తుల‌తో పాటు పొట్టి దుస్తుల‌లో ఈ అమ్మ‌డు వేసిన డ్యాన్స్ చూసి యూత్‌కి చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయి. ప్ర‌స్తుతం స‌మంత డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ లేపుతుంది.

samantha dance again Oo Antawa Maa Song video 

samantha dance again Oo Antawa Maa Song video

Samantha : పొట్టి దుస్తుల‌లో ర‌చ్చ లేపిన స‌మంత‌

స‌మంత డ్యాన్స్ చేసిన ఊ అంటావా పాట‌కి ఎంత క్రేజ్ ద‌క్కిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఇటీవ‌ల ఓ చిన్న అమ్మాయికి వాళ్ల అమ్మ ఇంగ్లీష్ ప‌దం Whoని చూపించి హు అంటార‌ని చెబుతుంది. ఆ పాప అలా చెబుతూనే ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ పాట పాడుతుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అయింది. ఈ వీడియోను ఏకంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ షేర్ చేయ‌డం విశేషం.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp