Home » Entertainment » Samantha Dance With Allu Arjun In Pushpa Movie
Entertainment

Samantha : పుష్పలో అల్లు అర్జున్‌తో స‌మంత ఐటం సాంగ్‌..!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 14, 2021, 3:50 pm
Advertisement

Samantha  : అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలంటే అందరికీ అంచనాలుంటాయి. సుక్కు స్టైల్, బన్నీ యాక్టింగ్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్నీ అద్బుతంగా సెట్ అవుతుంటాయి. ఆర్య, ఆర్య 2 చిత్రాలు ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు. ఇక వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు, అందులోని ఐటం సాంగ్‌లు ట్రెండ్ సెట్టర్. మామూలుగానే సుకుమార్ సినిమా ఐటం సాంగ్‌లకు స్పెషలిస్ట్ అనే ముద్ర ఉంది.

Advertisement

అయితే తాజాగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.పుష్ప చిత్రంలోనూ అదిరిపోయే మాస్ బీట్ ఒకటి ఉందట. ఈ ఐటం సాంగ్‌కు సుకుమార్ స్పెషల్‌గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఐటం సాంగ్‌కు సంబంధించిన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. సమంతను ఈ చిత్రంలోని ఐటం సాంగ్‌కు సెలెక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

samantha dance with allu arjun in pushp Movie

Advertisement

Samantha అల్లు అర్జున్‌తో సమంత స్టెప్పులు

అదే గనుక నిజం అయితే సమంత తన కెరీర్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మొదటి సారి అవుతుంది. ఎందుకంటే ఇంత వరకు సమంత ఐటం సాంగులకు స్టెప్పులు వేయలేదు.అయితే ఇదే నిజమైతే.. బన్నీ రేంజుల్లో మాస్ బీట్‌కు సమంత కాలు కదపగలదా? అసలే సమంతకు డ్యాన్సులు అంతంత మాత్రంగానే వచ్చు. మరి బన్నీ పక్కన సమంత స్టెప్పులు అంటే ఎలా ఉంటుందో చూడాలి.

అయినా ఇవన్నీ ఆలోచించకుండా సుకుమార్ ఈ నిర్ణయం తీసుకుంటాడా? అనేది కూడా అనుమానమే. మొత్తానికి సమంత, బన్నీ పుష్ప సినిమాలో ఐటం సాంగ్‌కు దుమ్ములేచిపోయేలా స్టెప్పులు వేస్తారేమో చూడాలి. అసలు పుష్పలో సమంత అనే వార్తపై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి