Samantha : ప‌చ్చబొట్లు అస్స‌లు వేయించుకోవ‌ద్దంటున్న స‌మంత‌..!

Authored By Sam C | The Telugu News | Published on: April 18, 2022, 6:00 pm

Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా హవాను చూపించారు. ‘ఏమాయ చేశావే’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరినీ ఫిదా చేసేసిందీ బ్యూటీ. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుని ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఈ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సామ్.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ త‌న అభిమానుల‌తో చాట్ చేసింది. ఈ చాటింగ్‌లో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌లో భాగంగా అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చింది. కొన్ని టాటూల్ని మీరు ఏదో ఒకరోజు ప్రేమిస్తారు కదూ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత నవ్వుతూనే స్పష్టంగా సమాధానమిచ్చింది. ఎప్పుడూ, ఎన్నడూ టాటూ వేసుకోవద్దని, ఎప్పటికీ వేసుకోద్దని స్పష్టం చేసింది. సమంత ఒంటిపై ఇప్పటికే మూడు టాటూలున్నాయి. ఒకటి సమంత మెడ కింద వెనుకభాగంలో వైఎంసీ అని ఉంది. అంటే ఏం మాయ చేశావే అని అర్ధం. రెండవ టాటూ ఆమె కుడివైపు రిబ్స్‌పై ఉంది. చే అని రాసుంది. ఇక మూడవది చాలా ప్రత్యేకం.

samantha doesnt encourage tatoos

samantha doesnt encourage tatoos

Samantha : స‌మంత వ‌ద్దంటుంది..

సమంత, నాగ చైతన్యలిద్దరూ మోచేతిపై రెండు బాణాలు గుర్తులు వేసుకున్నారు.ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమంత.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గత ఏడాది ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఫలితంగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్‌గా శాకుంతలం, య‌శోద సినిమాల షూటింగ్ పూర్తి కాగా, ఈ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp