Samantha : మీ వలన ధైర్యంగా ఎదుర్కొంటానంటూ సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు హాట్ టాపిక్‌గా మారుతుంది. సమంత నిన్నతన 35వ బర్త్ డే జరుపుకోగా, ఈ క్రమంలో వీడీ11 చిత్ర బృందం పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది.ఇక పలువురు టాలీవుడ్ ప్రముఖులు సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. వీరిలో సాయి ధరమ్ తేజ్, నందినిరెడ్డి, రకుల్‌ప్రీత్ సింగ్, కాజల్, కీర్తిసురేశ్, హన్సిక, రష్మిక, త్రిష, కంగనా రనౌత్, వరుణ్ ధావన్, వెన్నెల కిషోర్, ఉపాసనతోపాటు పలువురు డైరెక్టర్లు, చిత్ర నిర్మాతలు ఉన్నారు. ఇక తన బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన వారందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసింది.
విజయ్ ట్వీట్‌ని షేర్ చేస్తూ.. ‘స్వీటెస్ట్ సర్ ప్రైజ్’ అంటూనే “సినిమాకు సంబంధించి మాకు చాలా పని ఉంది. కానీ అక్కడి గడ్డకట్టే చలి కూడా ఈ స్కామ్‌స్టర్‌లను నన్ను సర్ప్రైజ్ చేయడాన్ని ఆపలేకపోయింది” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనను విష్ చేసిన అభిమానులందరికీ థ్యాంక్స్ నోట్ కూడా రాసింది. “నా పుట్టినరోజు సందర్భంగా ప్రేమ, శుభాకాంక్షలను కురిపించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు! మీ అందరి నుండి నాకు లభించిన ప్రోత్సాహం, ప్రేరణ, సానుకూల వైబ్‌లకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. ఈ ఏడాదిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటానంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Samantha Emotional Post
Samantha : సామ్ ఎమోషన్..
మజిలీ ఫేమ్ శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది కశ్మీర్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీగా రూపొందుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో విజయ్, సామ్… సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో నటించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్ధరూ కలిసి నటిస్తున్నారు. హీరోగా విజయ్ దేవరకొండకు ఇది 11వ చిత్రం. డియర్ కామ్రేడ్ తర్వాత మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ తో రౌడీ హీరో పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి మళయాల ఫేమ్ హిషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో జయరామ్, సచిన్ ఖేడ్కర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు