Samantha: దుబాయ్ హోటల్‌లో సమంత.. ఆ లగ్జరీ చూస్తే మతిపోవాల్సిందే..!
నాగ చైతన్యతో విడాకుల ప్రకటన చేసిన అనంతరం అస్సలు తగ్గడం లేదు సమంత. తనకు ఎంతో ఇష్టమైన వారితో ఇష్టమైన ప్రదేశాలను చుట్టి వస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్‌గా గోవా టూర్, ఆ వెంటనే చార్ ధామ్ యాత్రకు వెళ్లి అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించుకు వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోంది. విడాకుల తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేలా అందమైన లొకేషన్స్‌లో విహరిస్తోంది.

Samantha enjoying in dubai star hotel
తగ్గేదే లే!!
తన స్నేహితులు ప్రీతమ్, శిల్పారెడ్డిలతో కలిసి ఇటీవలే దుబాయ్ వెళ్లిన సామ్.. అక్కడి స్టార్ హోటల్‌లో బస చేస్తూ వీధి వీధి చుట్టేసి వస్తోంది. సాధారణంగానే టూర్స్ అన్నా, షికార్లు కొట్టడమన్నా చాలా ఇష్టపడే సమంత.. దుబాయ్ అందాల్లో సరదాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాను బస చేస్తున్న హోటల్ సహా అక్కడి ఎత్తైన, అందమైన భవనాలను చూపిస్తూ తన ఇన్స్‌స్టా స్టోరీ పెట్టుకుంది సమంత. ఆమె పెట్టిన ఈ వీడియో చూసి బాబోయ్! ఆ లగ్జరీ మామూలుగా లేదుగా. ఎంతైనా సమంత సమంతనే.. తగ్గేదే లే!! అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇకపోతే నాగ చైతన్యతో విడాకుల వ్యవహారంపై తనను ఇష్టారీతిలో నిందిస్తూ వీడియోలు పోస్ట్ చేసిన పలు యూట్యూబ్ చానల్స్‌పై సమంత కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. కోర్టు ద్వారా ఆమెకు అనువుగా తీర్పు రావడమే గాక యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలకు సదరు వీడియోలు వెంటనే డిలీట్ చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఏదేమైనా నిత్యం ఇలా ఏదో ఒక రూపంలో సమంత న్యూస్ వైరల్ అవుతుండటం చూస్తున్నాం.