Samantha : కాజల్ ప్రెగ్నెన్సీపై స్పందించిన సమంత.. నీపై చాలా ప్రేమ ఉందని కామెంట్
Samantha : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ తన జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. బ్యాచిలర్‌గా ఉన్న సమయంలో వరుస సినిమాలు చేసిన ఈ ముద్దగుమ్మ గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయి ఏడాది కూడా కాలేదు అప్పుడే గుడ్ న్యూస్ చెప్పింది. రీసెంట్‌గా కాజల్ అగర్వాల్ గర్భం దాల్చిన విషయాన్ని ఇన్ స్టా వేదికగా ఓ వీడియో రూపంలో రివీల్ చేసింది. అంతకు ముందే విషయాన్ని కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ రివీల్ చేసారు.కాజల్ ప్రగ్రెన్సీ కిట్ ప్రమోషన్‌లో భాగంగా వీడియో షేర్ చేస్తూ..
ఈ సంవత్సరం నా చిన్నారిని కలవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను,ప్రెగా న్యూస్ నాకు ఖచ్చితమైన మరియు వేగవంతమైన ఫలితాలను సులభంగా అందించడంతో, నా గర్భధారణ ప్రయాణం సరైన మార్గంలో ప్రారంభమైందని నేను విశ్వసిస్తున్నాను. నేను ఎందుకు ఎంచుకున్నానో తెలుసుకోవడానికి నా వీడియో చూడండి”. అని వీడియో పోస్ట్ చేసింది.కాజల్ వీడియోకి చాలా మంది ప్రముఖులు స్పందించారు. సమంత పెట్టిన కామెంట్ వైరల్‌గా మారింది. అందమైన పడుచుపిల్ల ఎంత మెరిసిపోతుందో చూడండి.

samantha excited for pregnant Kajal Aggarwal
Samantha కాజల్‌కి పుట్టబోయే బిడ్డపై సమంత ఆసక్తి
నీపై చాలా ప్రేమ ఉంది ప్రియమైన కాజ్…చాలా సంతోషంగాను ఉంది. నేను చాలాచాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని సమంత ట్వీట్ చేసింది. ఇప్పుడు సమంత ట్వీట్ పై రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదని..గర్భధారణకు ఆమె వ్యతిరేకమని ఈ విషయంలో చైతన్యతో వివాదం తలెత్తినట్లు అప్పట్లో ప్రచారం సాగింది.కాని తాజా ట్వీట్‌తో సమంతపై వచ్చినవన్నీ పుకార్లు అని కొందరు చెప్పుకొస్తున్నారు.

samantha excited for pregnant Kajal Aggarwal
View this post on Instagram