Samantha : జీవితంలో చాలా మాన‌సిక స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాను : స‌మంత‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : జీవితంలో చాలా మాన‌సిక స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాను : స‌మంత‌

 Authored By sandeep | The Telugu News | Updated on :9 January 2022,7:30 pm

Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లిలో కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమె చేసే పోస్ట్‌లు, మాట్లాడే మాట‌లు ప్ర‌తీది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. విడాకుల త‌ర్వాత స‌మంత త‌న జీవితంలో జ‌రిగిన చాలా విష‌యాల గురించి ఒక్కొక్క‌టిగా బ‌య‌ట పెడుతూ వ‌స్తుంది. రీసెంట్‌గా రోషిని ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సైకియాట్రిక్ ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో సమంత పాల్గోంది. ఈ సంద‌ర్బంగా స‌మంత చాలా విష‌యాలు షేర్ చేసింది.శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను కలిసినట్లుగానే మనసుకి గాయం అయినప్పుడు కూడా డాక్టర్లను సంప్రదించాలని సమంత సూచించారు.

స్నేహితులు, కుటుంబ సభ్యులు, వైద్యుల మద్దతుతోనే ఇవాళ ధైర్యంగా నిలబడినట్టు వివరించారు. ప్రతి మానసిక సమస్యకు వైద్యుల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదని, సరైన కౌన్సెలర్‌ ఉంటే సమస్య తేలిగ్గా సమసిపోతుందని చెప్పారు.నా జీవితంలో చాలా మానసిక సమస్యలు ఫేస్ చేసాను. ఆ టైమ్‌ లో తన స్నేహితులు.. తన డాక్టర్స్ సహాయంతో తాను ఈ సమస్యలను ఎదిరించి బయట పడ్డానంటోంది స‌మంత‌.

Samantha facing more problems

Samantha facing more problems

Samantha : కౌన్సెలర్‌ ఉంటే సమస్య తేలిగ్గా పోతుంది: స‌మంత‌

విడాకుల త‌ర్వాత స‌మంత త‌న మ‌న‌సుకు అయిన గాయం న‌యం చేసుకునేందుకు ఫ్రెండ్స్‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపింది. తీర్ధ‌యాత్రలు, విహార‌యాత్ర‌లకు వెళ్లింది. ఇటీవ‌ల గోవా వెళ్లిన స‌మంత బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక స‌మంత సినిమాల‌తోను ఫుల్ బిజీగా ఉంది స‌మంత‌. రీసెంట్ గా ఆమె చేసిన పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యశోద మూవీ షూటింగ్ లో ఉన్నారు సమంత . గుణశేఖర్ డైరెక్షన్ లో శాంకుంతలం మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసేసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది