Home » Entertainment » Samantha Fans Trolls And Comments On Shakuntalam Movie Director
Entertainment

Samantha : ఆ దర్శకుడిని ఇంకా ఎప్పుడంటూ బూతులు తిడుతున్న సమంత ఫ్యాన్స్‌…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: September 6, 2022 6:30 pm
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తూ శాకుంతలం సినిమా ఎప్పుడు విడుదల చేస్తావు అంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ సినిమా ఎప్పుడో ఆరు ఏడు నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసి కూడా ఎందుకు విడుదల చేయలేక పోతున్నావు అంటూ గుణశేఖర్ ని సమంత అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సినిమా మేకింగ్ తెలియనప్పుడు.. సినిమా మేకింగ్ చేతకానప్పుడు ఎందుకు స్టార్ హీరోయిన్స్ తో సినిమా మొదలు పెట్టాలి అంటూ ఆయన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం కామనే, కానీ ఆ సినిమా కు సంబంధించి అప్పుడప్పుడు అప్డేట్స్ ఇతర విషయాలను అభిమానులకు చేర వేయడం ద్వారా అభిమానులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ శాకుంతలం సినిమా విషయంలో అలాంటిది ఏమీ జరగడం లేదు. శాకుంతలం సినిమా కు సంబంధించి రెండు పోస్టర్లు మాత్రమే ఇప్పటి వరకు సమంత పుట్టిన రోజు సందర్భంగా విడుదలయ్యాయి. అంతకు మించి సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ కానీ అప్‌ డేట్స్ కానీ దర్శకుడు గుణశేఖర్ ఇవ్వలేదు అంటూ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈయన అనుష్క తో రుద్రమదేవి సినిమా ను తెరకెక్కించాడు.

samantha fans trolls and comments on shakuntalam movie director

Advertisement

ఆ సమయంలో కూడా ఆలస్యం కారణంగా అనుష్క అభిమానుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నాడు. సినిమా విడుదలయ్యాక ఆమె అభిమానులు గుణశేఖర్ ని ప్రశంసించారు అది వేరే విషయం అనుకోండి.. ఇప్పుడు సమంత శాకుంతలం సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా సమంత అభిమానులు కూడా గుణశేఖర్ పై ప్రశంసలు కురిపించే అవకాశం ఉంది. ఒక మంచి సినిమా చేస్తున్నప్పుడు కాస్త ఆలస్యం అవుతుంది.. కనుక అభిమానులు ఓపిక పట్టి శాకుంతలం సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. గుణశేఖర్ ఒక మంచి దర్శకుడుగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. కనుక ఆయన నుండి మరో మంచి సినిమా శాకుంతలం రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి