Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి అంటూ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఎన్టీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారికి ఎన్టీఆర్ అంటే మొదటి నుండి ఒకింత కోపం అయ్యి ఉంటుంది లేదా ఎన్టీఆర్ అంటే వారికి ఇష్టం ఉండి ఉండదు. ఇప్పుడు దాన్ని ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఎన్టీఆర్ అభిమానులు వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ని కలిసిన విషయం తెలిసిందే. ఆ కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన కోపం ఉందట. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా హీరో నితిన్ కూడా ఇటీవల బీజేపీ నాయకుడినిన కలిశాడు. వారిద్దరూ రాజకీయంగా ఏమి మాట్లాడలేదు..
ఆయన కూడా అమిత్ షా ని కలవడంతో టాలీవుడ్ కి కేసిఆర్ కి మధ్య వైరం పెరిగినట్లు అయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వైరం కారణంగానే ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సల్ అయింది అనేది కొందరి వాదన. అయితే చిత్ర సభ్యుల ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేయ లేదు పోలీసుల అనుమతి లేని కారణంగానే సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయిందని వారు చెప్తున్నారు. రాజకీయ కోణం లేదు అనేది వారి మాట.. కానీ అసలు విషయం అదే అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ఏంటంటే టాలీవుడ్ లో ముందు ముందు జరగబోతున్న కార్యక్రమాలకు కచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏదో విధంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని..
అందుకు ఎన్టీఆర్ కారణం అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రాజకీయ కారణం లేకుండా వెళ్లి అమిత్ షా ని ఎందుకు కలవాల్సి వచ్చిందంటూ కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు ఎన్టీఆర్ ని ప్రశ్నిస్తున్నారట. అందరూ ఒక వైపు… ఎన్టీఆర్ ఒకవైపు అన్నట్లుగా ఇప్పుడు ఆయన పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వంతో మంచిగా ఉండాలని ఉద్దేశంతో చాలా మంది ఎన్టీఆర్ ని విమర్శిస్తున్నారు. దాంతో ఎన్టీఆర్ ఒంటరి వాడయ్యాడు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే ఆయన అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ని విమర్శించే స్థాయి ఎవరికీ లేదు అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.