samantha : కూతురి విడాకులపై స్పందించిన స‌మంత తండ్రి

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 5 October 2021, 2:50 pm

samantha సమంత నాగ చైతన్య విడాకులు జరిగి రెండు మూడు రోజులు గడుస్తున్నా కూడా ఇంకా కొందరు షాక్‌లోనే ఉన్నారు. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నారు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విడిపోవడానికి కారణాలు ఏమైనా కావొచ్చు. కానీ సమంత, నాగ చైతన్యల నుంచి ఇలాంటి నిర్ణయాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతోన్నారు. ఇప్పుడు విడిపోడం కాదు.. వారు వేరుగా ఉండబట్టి చాలా కాలమే అవుతోందట.

samantha father joseph prabhu comments on divorce

samantha father joseph prabhu comments on divorce

మామూలుగా ఈ ఇద్దరూ వేరుగా ఉంటారు. నాగ్, అమలతో కలిసి ఉండరు. అలా ఈ ఇద్దరూ సపరేట్ అయ్యక కూడా.. మళ్లీ ఈ ఇద్దరి మధ్య కూడా గ్యాప్ వచ్చింది. అలా సమంత ప్రస్తుతం చెన్నైకి వెళ్లిపోయింది. ఇక ముంబైకి మకాం మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సమంత విడాకుల విషయంపై టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా స్పందించారు. నాగార్జున అయితే ఓ ప్రెస్ నోట్ వదిలాడు. భార్యాభర్తల మధ్య జరిగింది పర్సనల్ అంటూ అసలు విషయాలను దాట వేశాడు.

Madhavilatha About Samantha naga chaitanya Divorce Issue

Madhavilatha About Samantha naga chaitanya Divorce Issue

samantha కూతురి విడాకులపై జోసెఫ్ ప్రభు..

అయితే ఇప్పుడు సమంత తండ్రి రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది. జోసెఫ్ ప్రభు ఓ మీడియాతో మాట్లాడాడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి తన మెదడు శూన్యంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారట. త్వరలోనే అన్ని పరిస్థితులు మామూలుగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశాడట. అయితే ఆయన కామెంట్లకు సమంత అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. మొత్తానికి సమంత నిర్ణయం కూడా కుటుంబ సభ్యులను షాక్‌కు గురి చేశాయన్నమాట.

Samantha Ruth Prabhu Stays Away From Social Media

Samantha Ruth Prabhu Stays Away From Social Media

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి