Samantha Father : స‌మంత‌కి దెబ్బ మీద దెబ్బ‌.. తండ్రి మ‌ర‌ణంతో కుమిలి కుమిలి ఏడుస్తున్న సామ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha Father : స‌మంత‌కి దెబ్బ మీద దెబ్బ‌.. తండ్రి మ‌ర‌ణంతో కుమిలి కుమిలి ఏడుస్తున్న సామ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 November 2024,6:04 pm

ప్రధానాంశాలు:

  •  Samantha Father : స‌మంత‌కి దెబ్బ మీద దెబ్బ‌.. తండ్రి మ‌ర‌ణంతో కుమిలి కుమిలి ఏడుస్తున్న సామ్..!

Samantha Father : హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది. ఇటీవ‌ల బాలీవుడ్ ‘సిటాడెల్ (హనీ, బన్నీ)’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

samantha father joseph prabhu dies of heart attack


samantha father joseph prabhu dies of heart attack

Samantha Father పితృ వియోగం..

అయితే ప్ర‌స్తుతం స‌మంత త‌న కెరీర్‌లో దూకుడు పెంచాల‌ని భావించ‌గా, ఊహించ‌ని దెబ్బ తగిలింది. నిన్న మొన్నటి వరకు సిటాడెల్‌ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా ఉన్న సమంత ఆ వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌తో జోష్‌ మీద ఉన్న సమంత ఒక్కసారిగా క్రుంగి పోయే సంఘటన జరిగింది. ఆమె తండ్రి జోసెఫ్‌ ప్రభు గుండె పోటుతో మృతి చెందారు. తండ్రి మరణంకు సంబంధించిన విషయాన్ని సమంత స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా హార్ట్‌ బ్రేక్‌ ఈమోజీని షేర్‌ చేయడం ద్వారా తెలియజేశారు. జోసెఫ్‌ ప్రభు మృతి పై ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి మరణంపై స్పందిస్తూ హార్ట్‌ బ్రేక్‌ ఈమోజీని షేర్‌ చేసిన సమంత.. ‘నాన్నా మనం మళ్లీ కలిసేంత వరకు’ అంటూ తన గుండె పగిలింది అన్నట్లుగా పేర్కొంది. సమంత తండ్రి మృతి పట్ల ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే విడాకులు, అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎదుర్కొన్న ఒడిదొడుకుల నుంచి బయట పడుతున్న సమంత మళ్లీ ఇంత పెద్ద విషాదంలో చిక్కుకోవడం బాధాకరం అంటూ ఆమె ఫ్యాన్స్‌ విచారం వ్యక్తం చేస్తున్నారు.జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. నిద్రలో ఆయన హార్ట్ అటాక్ కి గురయ్యారట, అదే ఆయన మరణానికి కారణం అని ప్రాథమిక సమాచారం. సమంత తండ్రి జోసెఫ్ భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు. ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో విషాదం నింపింది. ఈ ఘటన సమంతను తీవ్ర వేదనలో నింపింది. తాను కెరీర్లో ఎదగడం వెనుక తండ్రి జోసెఫ్ కృషి ఎంతగానో ఉందని సమంత పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు…

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి