Samantha : చైతుతో చేసిన‌ ఆ మూవీ త‌న‌కెంతో ప్రత్యేక‌మన్న‌ సమంత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : చైతుతో చేసిన‌ ఆ మూవీ త‌న‌కెంతో ప్రత్యేక‌మన్న‌ సమంత

 Authored By prabhas | The Telugu News | Updated on :6 March 2025,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : చైతుతో చేసిన‌ ఆ మూవీ త‌న‌కెంతో ప్రత్యేక‌మన్న‌ సమంత

Samantha : ఫిబ్రవరి 2010లో వచ్చిన ‘యే మాయ చేసావే’ సినిమాతో సమంత రూత్ ప్రభు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు అయింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించి, తన మాజీ భర్త నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తన కెరీర్ నిల‌దొక్కుకోవ‌డంలో ఎంతో సహాయపడింది. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆ చిత్రంలోని “ప్రతి ఒక్క షాట్‌ను గుర్తుచేసుకుంటూ మ‌రిచిపోలేన‌ని పేర్కొంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 15 సంవత్సరాలలో కొన్ని క్షణాలు “ఎప్పటికీ ఉన్నట్లు అనిపిస్తాయి” , మరికొన్ని క్షణాలు “అస్పష్టంగా అనిపిస్తాయి” అని ఆమె పేర్కొంది. జెస్సీ పాత్రధారి కార్తీక్‌ను కలిసినప్పుడే తాను చిత్రీకరించిన మొదటి సన్నివేశం అని నటి వెల్లడించింది. త‌న మొదటి సన్నివేశం కార్తీక్‌తో గేట్ మీటింగ్. ఆ క్షణం గురించి ప్రతి చిన్న విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే గౌతమ్ మీనన్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అని ఆమె పేర్కొంది.

Samantha చైతుతో చేసిన‌ ఆ మూవీ త‌న‌కెంతో ప్రత్యేక‌మన్న‌ సమంత

Samantha : చైతుతో చేసిన‌ ఆ మూవీ త‌న‌కెంతో ప్రత్యేక‌మన్న‌ సమంత

మైయోసిటిస్‌తో పోరాటం

తెరపై తన నటనతో పాటు, సమంత మైయోసిటిస్‌తో పోరాడిన విధానం అందరికీ స్ఫూర్తినిచ్చింది. నటి తన పోరాటాల గురించి బహిరంగంగా మాట్లాడింది. లక్షలాది మంది తమ సొంత స‌మ‌స్య‌ల‌ను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రేరేపించింది. ఆమె కోలుకునే సమయంలో గొప్ప ఓర్పు మరియు బలాన్ని ప్రదర్శించింది. ఆరోగ్యం, ఫిట్‌నెస్, జీవనశైలికి సంబంధించిన వివిధ అంశాలపై ఆమె వాదన ఆమెను ఒక పవర్‌హౌస్‌గా శక్తివంతం చేసింది.

స‌మంత 2023లో “కుషి” మూవీతో థియేటర్లలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఆ తర్వాత ఆమె వెబ్ సిరీస్ “సిటాడెల్ : హనీ బన్నీ”లో కనిపించింది. ప్రస్తుతం రాజ్-డికె “రక్త్ బ్రహ్మండ్” అనే వెబ్ సిరీస్‌ను చేస్తుంది. ఇటీవల ఆమె ‘రాజ్-డికె’ ద్వయంలో రాజ్ నిడిమోరుతో రిలేష‌న్స్‌లో ఉన్న‌ట్లు ఊహాగానాలు వ్యాపించాయి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది