
samantha post about kashmir
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు చేసే పోస్ట్‌లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంతపై ఒత్తిడి బాగా పెరిగింది. సమంత ఫ్యాన్స్ నాగ చైతన్యను తప్పుబడితే, చైతూ ఫ్యాన్స్ సమంతను ఆడిపోసుకున్నారు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలదే తప్పున్నట్లు చూసే సమాజం సమంతను టార్గెట్ చేసింది. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా అనేక పోస్ట్స్ వెలిశాయి. మీడియాలో అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి.
తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమెకు మిశ్రమ ఫలితాలొచ్చాయి.తాజాగా సమంతకు మరోసారి ట్రోలర్స్ దెబ్బ తగిలింది. ” నా మౌనాన్ని అజ్ఞానం అనుకోవద్దు. నేను సైలెంట్‌గా ఉన్నానంటే ఏదైనా అంగీకరిస్తానని అనుకోవద్దు. నా దయాగుణాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది” అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అయితే సామ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
samantha fire on trollers 2
సమంత పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.అయితే ఇలా పోస్ట్ చేసిన వెంటనే సమంత మరో పోస్ట్ వేసింది. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది సమంత. ఇక ఇప్పుడు నెట్టింట్లో ఓ వార్ జరుగుతోంది. అటు ఫ్యాన్స్ కూడా దీనిపై స్పందిస్తున్నారు. సమంత ట్వీట్ ని మరింత షేర్ చేసి సమంతతో జాగ్రత్త అంటూ పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ ట్వీట్ పై స్పందిస్తున్నారు. మరి సమంత ఇంత సీరియస్ గా ట్వీట్ ఎందుకు చేసిందో అంటూ మాట్లాడుకుంటున్నారు.సమంత ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో పలు చిత్రాలు చేస్తుంది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.