Home » Entertainment » Meena To Be Mother Again
Entertainment

Meena : మ‌ళ్లీ త‌ల్లి కాబోతున్న హీరోయిన్ మీనా..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 23, 2022, 5:30 pm
Advertisement

Meena : తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు మీనా. మీనా ఒకప్పుడు తెలుగులో అందరి హీరోల సరసన నటించి తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది . వెంకటేష్, చిరంజీవి, నాగార్జున ఇలా అందరితో ఆడిపాడింది. బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చి, తన అందచందాలతో, చక్కటి అభినయంతో చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచుకుంది. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. మీనా 1976 సెప్టెంబ‌ర్ 16న మ‌ద్రాసులో జ‌న్మించారు. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకుంది. వీరికి 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది.

Advertisement

త‌న కూతురితో క‌లిసి మీనా తెగ సంద‌డి చేస్తుంటుంది.ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి అమ్మ, అక్క, చెల్లి, వదిన తదితర పాత్రలు చేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో నటి మీనా సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు వీడియోలు వంటివి షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటోంది. తాజాగా నటి మీనా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటోలో నటి మీనా చీర కట్టుకున్న తరువాత మేనేజ్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందోనని చాలా సున్నితంగా తెలిపింది.

meena to be mother again

Advertisement

Meena : మీనా షాకింగ్ న్యూస్..

వీడియోలో మీనా కాస్త ఒళ్లు చేసిన‌ట్టు, అదో ర‌కంగా క‌నిపించ‌డంతో నటి మీనా మళ్ళీ తల్లి కాబోతుందని తప్పుగా అర్థం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫొటోలు వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. మ‌రి దీనిపై మీనా ఎలా రియాక్ట్ అవుతుందో అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఈ ఏడాది మొద‌ట్లో మీనా ఫ్యామిలీ అంతా క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. . ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని తెలిపింది. .

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి