Samantha : గుండె బద్దలైందట!.. విషాదంలో సమంత

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 25 October 2021, 2:54 pm

Samantha  సమంత మొన్నటి వరకు తీర్థయాత్రల్లో మునిగిపోయింది. ఛార్ ధామ్ యాత్రలోని విశేషాలను పంచుకుంటూ వచ్చింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్,బద్రీనాథ్ అంటూ అక్కడి అద్భుతాలను అందరికీ చెప్పేసింది. ఇక ఇప్పుడు ఇంటికి వచ్చేసింది. నిన్న ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసింది. అయితే తాజాగా సమంత గుండె ముక్కలైందట. ఆ వార్త మామూలుగా అయితే సమంతకే కాకుండా సినీ అభిమానులందరికీ విషాదమే.

Samantha

Samantha

హాలీవుడ్ ఫేమస్ నటుడు జేమ్స్ మైఖేల్ టైలర్ నేడు మృతి చెందారు. ప్రోస్టేట్ క్యానర్స్‌తో గత కొన్నేళ్లు బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ప్రోస్టేట్ నుంచి బోన్స్ వరకు వ్యాప్తించింది. అలా చివరకు మైఖేల్ టేలర్ మరణించారు. అయితే ఈయన మరణ వార్త తెలుసుకున్న ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ రీయూనియన్‌లో ఈయన అద్బుతమైన పాత్రను పోషించి ఫేమస్ అయ్యాడు.

Samantha  అభిమాన హీరో మరణంతో సమంత ఎమోషనల్

ఈయన మరణ వార్తను తట్టుకోలేకపోయిది సమంత. నో అంటూ గుండె బద్దలైనట్టు, ముక్కలైన ఎమోజీన షేర్ చేసింది. సమంతకు ఆయన అంటే చాలా అభిమానం అని తెలుస్తోంది. మొత్తానికి సమంతకు క్రికెట్ ఫ్యాన్. నిన్న ఇండియా ఓడిపోయింది. మరో వైపు తన అభిమాన నటుడు మరణించారు. ఇలా సమంతకు దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అయింది. సమంత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రెడీ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రెండు చిత్రాలను చేస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి