Samantha : ఎయిర్‌పోర్ట్‌లో స‌మంత డ్యాన్స్ చేయ‌డం వెన‌క అస‌లు సీక్రెట్ ఇదేన‌ట‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ఎయిర్‌పోర్ట్‌లో స‌మంత డ్యాన్స్ చేయ‌డం వెన‌క అస‌లు సీక్రెట్ ఇదేన‌ట‌..!

 Authored By sandeep | The Telugu News | Updated on :22 February 2022,2:00 pm

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఆమె ఏం చేసిన కూడా అది సెన్సేష‌న్ అవుతుంది. సినిమాలు, సోష‌ల్ మీడియా ద్వారా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవ‌ల ఎయిర్‌పోర్ట్‌లో సరదాగా అరబిక్ కుత్తు పాటకు డాన్స్ చేసి ఇనిస్ట్రాలో పోస్ట్ చేసింది. పాటలోని సిగ్నేచర్ స్టెప్ ని ఆమే వేసి ,దుమ్మురేపింది. రిప్పడ్ జీన్స్ లో అదీ లేట్ నైట్ ఎయిర్ పోర్ట్ లో చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నిమిషాల వ్యవదిలోనే వైరల్ గా మారడం జరిగిపోయింది. స‌మంత సాంగ్‌కి పూజా హెగ్డే కూడా ఫిదా అయింది. అయితే ఈ సాంగ్ వేయ‌డానికి గ‌త కారణం తాజాగా వివ‌రించింది స‌మంత‌.

ఎయిర్ పోర్ట్ లో ఉన్న సమంత అనుకోకుండా ఈ వీడియో చూసిందట‌. వెంటనే తనకు కూడా డాన్స్ చేయాలని అనిపించిందట. అనుకున్నదే తడవుగా అప్పటికప్పుడు ఆ స్టెప్పుల్ని వేశానని, ఆ పాట తనకు అంత బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది సమంత. అది ప్లాన్ చేసి వేసిన డాన్స్ కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక వీడియో విషయానికొస్తే పూజాహెగ్డే అందాలు, విజయ్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స‌మంత స్టెప్పుల‌కి నెటిజ‌న్స్ పిచ్చిపిచ్చిగా కామెంట్స్, లైకులు కురిపించిన విష‌యం తెలిసిందే.స‌మంత విష‌యానికివ‌స్తే ఈ అమ్మ‌డు ఒక‌వైపు సినిమాలు,మ‌రో వైపు విహార‌యాత్ర‌ల‌తో ఫుల్ బిజీగా ఉంది.

samantha gives the reason for airport dance

samantha gives the reason for airport dance

Samantha : అది అస‌లు కార‌ణం..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో దర్శకుడు గుణశేఖర్‌ ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శాకుంతలం’. మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమ కావ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌మోహన్‌ వెండితెరపై కనిపించనున్నారు. రీసెంట్‌గా సినిమాలోని సమంత ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇది ఆక‌ట్టుకుంది. మ‌రోవైపు స‌మంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’. హరి, హరీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ నేతృత్వంలో రూపొందిన మూడుకోట్ల రూపాయల హోటల్‌ సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది