Samantha : సామ్ చై బాటలో మరో సూపర్ స్టార్.. 35 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్

 Authored By mallesh | The Telugu News | Updated on :30 December 2021,5:00 pm

2021 Relations break : 2021 ఏడాది దంపతులకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ముఖ్యంగా సెలబ్రిటీలకు అస్సలు కలిసి రాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలతో పాటు పెద్దల సమక్షంలో ఒక్కటైన జంటలు విడిపోయాయి. ముందుగా టాలీవుడ్ విషయానికొస్తే క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగచైతన్య తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. తామిద్దరం విడిపోతున్నామని నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అంతకుముందు సామ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌‌లో అక్కినేని అనే పదం తొలగించింది. ఈ విధంగా సామ్ చై విడిపోతున్నారని వార్తలు రావడంతో ఎట్టకేలకు అక్కినేని చైతన్య దానిపై క్లారిటీ ఇచ్చారు.

2021 Relations break : సామ్ చై బాటలో హాలీవుడ్ స్టార్

ఈ ఏడాది విడాకులు తీసుకున్న వారిలో సామ్ చై కంటే ముందే బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన రెండో భార్య కిరణ్ రావుకు అమీర్ ఖాన్ విడాకులు ఇచ్చారు. మనస్పర్దల కారణంగానే వీరు కూడా విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. సామ్ చై ఎటువంటి సంతానం కలుగక ముందే తమ బంధానికి ముగింపు పలికితే అమీర్ ఖాన్ దంపతులు పిల్లలు పుట్టాక కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్ కూడా తన భార్య నుంచి విడాకులు పొందాడు.

samantha anger on naga chaitanya

samantha anger on naga chaitanya

ఆర్నాల్డ్ తన భార్య మరియా శ్రివర్‌ ఇద్దరూ ఏకాభిప్రాయంతో విడాకులకు దరఖాస్తూ చేసుకుంటే.. 10 యేళ్ల తర్వాత వీరికి స్థానిక కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆర్నార్డ్ తన భార్యకు ఇచ్చే భరణంపై క్లారిటీ రావడంతో 35 ఏళ్ల తమ వైవాహిక బంధానికి పులిస్టాప్ పడింది. ఆర్నాల్డ్ భార్య అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీకి మేనకోడలు అవుతుంది. 1986లో వీరికి పెళ్ల జరగగా నలుగురు పిల్లలు ఉన్నారు. ఇక ఆర్నాల్డ్ 1970లో హెర్కులస్ ఇన్ న్యూయార్క్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. కాలిఫోర్నియా గవర్నర్‌గా కూడా పనిచేశారు. బాడీ బిల్డర్‌గా రాణిస్తూనే సినిమాల్లో నటించి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి