mini power plant : ఇంట్లో ఓ మూలకు అమరిపోయే పవర్ ప్లాంట్ ఆవిష్కరణ.. ఇక కరెంట్ కష్టాలు ఉండవు
mini power plant : పల్లె టూరు, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా కరెంట్ కట్టింగ్ లు అనేవి చాలా కామన్ గా ఉంటూ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో కరెంటు కట్టింగ్ తో సమస్యలు పడుతూనే ఉన్నారు. అందుకే అమెరికాకు చెందిన ఆర్నాల్డ్ లీటర్న్ సోలార్ ను తయారు చేశాడు. ఆయనకు వచ్చిన అద్బుతమైన ఆలోచన ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆశలను కలిగిస్తుంది. అతి చిన్న సెటప్ తో ఏకంగా పవర్ ప్లాంట్ ను ఇంట్లో ఏర్పాటు చేసుకునేలా ఆర్నాల్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చేసిన ఈ పనితో మొత్తం ప్రపంచం సోలార్ పవర్ వైపుకు తిరిగి చూసే పరిస్థితి వచ్చింది. ఆయన ఆవిష్కరణ అద్బుతం అంటూ అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు సైతం అంటున్నారు.
mini power plant : ఇంట్లో కరెంట్ పోవడంతో ఈ ఆలోచన..
అమెరికాలోని కాలిఫోర్నియాలో బే ఏరియాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో భూ కంపాలు వచ్చిన సమయంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను సోలార్ బ్యాటరీ కిట్ ను ప్రతి ఒక్క ఇంట్లో ఉంచుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. ఒక రోజు ఆర్నాల్డ్ ఇంట్లో భారీ తుఫాను గాలులకు కరెంటు పోయింది. దాంతో తన ఇంట్లో ఉన్న సోలార్ బ్యాటరీ కిట్ ను ఉపయోగించుకుని ఏదైనా చేయవచ్చా అని ఆ రోజు ఆర్నాల్డ్ కు ఆలోచన వచ్చింది. ఆ రోజు నుండి మొదలుకుని ఆర్నాల్డ్ ఆ దిశగా ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. తాను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా మానేసి చివరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నాడు.
యూసోలార్ కోసం ఆర్నాల్డ్ తపన..
సోలార్ సిస్టమ్ ను ఉపయోగించి ఇంట్లో ఏసీల నుండి మొదలుకుని అన్నింటిని కూడా నడిపే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాని ఈ సమయంలోనే సోలార్ సిస్టమ్ కు సంబంధించిన కొంత సాంకేతిక పరిజ్ఞానం ఆర్నాల్డ్ వల్ల లోపించడంతో మొదటి ప్రయత్నం బెడిసి కొట్టింది. పెట్టబడి అంతా కూడా బూడిద పాలు అయ్యింది. నష్టపోయాం, ఓడిపోయాం అని మానేయకుండా పూర్తిగా టెక్నాలజీపై అవగాహణ పెంచుకుని మరో ప్రయత్నం ను మొదలు పెట్టాడు. ఈసారి యూ సోలార్ ను ఏర్పాటు చేసి తనకున్న పరిజ్ఞానం మరియు తన యొక్క సాంకేతిక పరిస్థితులను పెంచుకుని సోలార్ కిట్ ను తయారు చేశాడు. ఇండియా వంటి దేశంలో ఈ సోలార్ కిట్ ఉపయోగం ఎక్కువగా ఉందని ఈ సందర్బంగా ఆర్నాల్డ్ చెప్పుకొచ్చాడు. భవిస్యత్తు మొత్తం ఈ సోలార్ కిట్ లదే అంటూ ఆయన చెబుతున్నాడు.