Samantha : స‌మంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అంత సంపాదిస్తుందా..!

Authored By Sam C | The Telugu News | Published on: March 28, 2022, 12:30 pm

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఫోటోషూట్స్.. విదేశాల్లో ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేసేస్తుంటుంది. ఆమె చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ట్రోలింగ్ చేసిన కూడా స‌మంత త‌గ్గేదే లే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. విడాకులు ప్రకటించిన తర్వాత సమంత ఎక్కువగా తన ఇన్‏స్టాలో మోటివేషనల్ కోట్స్.. మై మామ్స్ సెడ్ అనే హ్యాష్‏ట్యాగ్‏తో కోట్స్ షేర్ చేసింది. అప్పట్లో సామ్ షేర్ చేమే పోస్ట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. తన ఇన్‏స్టాలో మై మామ్స్ సెడ్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

స‌మంత ఇప్పుడు ప్రొఫెష‌న‌ల్‌గా మారింది. త‌న ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతూ ల‌క్ష‌లు సంపాదిస్తుంది. ఆమె పోస్ట్ చేసే ప్ర‌తి పోస్ట్ కూడా ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తెచ్చి పెడుతుంద‌ట‌. స‌మంత ఒక్క పోస్ట్‌కి మూడు నుండి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ట‌. అదే అందులో న‌టిస్తే రెమ్యున‌రేష‌న్ డ‌బుల్‌గా ఉంటుంద‌ని స‌మాచారం. స‌మంత ఇప్పుడు పూర్తిగా సంపాద‌న మీదే దృష్టి సారిస్తుంది. సమంత తన సినిమాలు, వ్యాపారాలు, పర్సనల్ లైఫ్, ఫ్రెండ్స్ ఇలా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తోంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంతలో చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.

samantha How Much Earnings Instagram

samantha How Much Earnings Instagram

Samantha : స‌మంత హ‌వా..

సమంత చేస్తోన్న విహార యాత్రలు, అడ్వెంచర్లు, ఒప్పుకునే సినిమాలు, వ్యాపార ప్రకటనలు ఇలా అన్నీ కూడా వైరల్ కాసాగాయి. ఇప్పుడు సమంత యశోద అనే సినిమా సెట్‌లో బిజీగా ఉంది. యశోద సినిమా కోసం టీం అంతా కూడా నార్త్ ఇండియాకు మకాం మార్చినట్టు కనిపిస్తోంది. ప్ర‌స్తుతం స‌మంత శాకుంత‌లం చిత్రంతో పాటు య‌శోద సినిమాలు చేస్తూ మ‌రో వైపు బాలీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉంది. స‌మంత జోరు చూస్తుంటే ఈ అమ్మ‌డు రానున్న రోజుల‌లో సెన్సేష‌న్స్ క్రియేట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

 

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp