Samantha : ఇలా మారిపోతావా?.. స్టార్ హీరోపై సమంత కామెంట్స్
Samantha : సమంత ప్రస్తుతం తన కెరీర్ మీదే ఫోకస్ పెట్టేసింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత ఫుల్ జోరు మీదుంది. స్పెషల్ సాంగ్, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు, దక్షిణాది సినిమాలతో బిజీగా ఉంది. హాలీవుడ్ దర్శకుడితోనూ సమంత పని చేయబోతోంది. ఇక సమంత ఇప్పుడు సినిమాల ద్వారా కాకుండా యాడ్స్ ద్వారా కూడా ఫుల్లుగా సంపాదించేస్తోంది.
ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంతకు ఉత్తరాదిన కూడా ఫుల్ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వచ్చాయట. అయితే ఇప్పుడు స్టార్ హీరోతో కలిసి సమంత నటించింది. కానీ అది సినిమా కోసం కాదు. ఓ యాడ్ కోసం స్టార్ హీరోతో కలిసి సమంత నటించింది. దీనికి సంబంధించిన ప్రకటన బయటకు వచ్చింది. ఆ వీడియోను సమంత షేర్ చేసింది.

Samantha In Akshay Kumar With Kurkure Ad
Samantha : అక్షయ్ కుమార్‌తో సమంత..
ఇందులో అక్షయ్ కుమార్ దొంగలా మారిపోయాడు. ఇంట్లోకి దొంగతనానికి అక్షయ్ కుమార్ వస్తాడు. కుర్ కురే చూసి అక్కడే ఆగిపోతాడు. కుర్ కురే మాయలో పడిపోతాడు. ఇంతలో సమంత పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఆ దొంగను పట్టించేస్తుంది. ఇలా సినిమాల్లో పోలీస్‌గా ఉన్న మీరు.. ఇలా దొంగగా మారిపోతారా? అంటూ సమంత చేసిన కామెంట్ మీద అందరూ నవ్వుకుంటున్నారు.
Police officer of the movies turns out to be a Kurkure chor. @akshaykumar ???? this behaviour?#Kurkure #AbLagaMasala @KurkureSnacks pic.twitter.com/s5T5OZtyO2
— Samantha (@Samanthaprabhu2) January 11, 2022