Samantha : ఆవేశంలో జరిగింది.. ఇప్పుడేం చేయలేం.. విడాకులపై సమంత స్టన్నింగ్ కామెంట్..!
Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత గత కొద్ది రోజులుగా విడాకుల విషయంతో వార్తలలో నిలుస్తుంది. ‘ఏమాయ చేసావె’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీతో తెలుగు తెరకు పరిచయం అయిన సామ్.. ఆ సినిమా అంత గొప్పగా ఆడకపోయినా తెలుగులో బిజీ హీరోయిన్లలో ఒకరైపోయింది. పదేళ్లకు పైగా స్టార్ హీరోల సరసన పెద్ద పెద్ద సినిమాలు చేసింది. పెళ్లి.. విడాకులు.. అనారోగ్యం.. ఇలా కొన్ని దశల తర్వాత ఆమె కెరీర్ జోరు తగ్గింది.
అనారోగ్యానికి చికిత్స కోసం గ్యాప్ తీసుకున్నాక ఆమె అవకాశాలు దాదాపు ఆగిపోయిన పరిస్థితి. ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ పేరుతో స్వీయ నిర్మాణంలో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా పట్టాలెక్కినట్టు ఏమి తెలియడం లేదు.ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. మన జీవితంలో కొన్ని విషయాలను నేర్చుకోవాలని, మరికొన్నింటిని మార్చుకోవాలని అందరూ భావిస్తారని, జీవితంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు అయ్యో.. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటామని సమంత చెప్పింది.
Samantha : ఆవేశంలో జరిగింది.. ఇప్పుడేం చేయలేం.. విడాకులపై సమంత స్టన్నింగ్ కామెంట్..!
అవి జరిగిపోయిన తర్వాత మార్చుకోవాలన్నా వీలుకాదని, ప్రస్తుతం వెనుతిరిగి చూసుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు అవుతుందని, జరిగిపోయిన గతంతో పోలిస్తే తాను ఎంతో ధైర్యంగా సమస్యలపై పోరాడానన్నారు. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడానికి అగ్నిగుండం లాంటి సమస్యలను కూడా అధిగమించానని చెప్పారు. దీంతో సమంత మాట్లాడిన మాటలన్నీ విడాకుల గురించే అని అందరికీ అర్థమైంది. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
New Ration Cards : రేషన్ కార్డు కోసం వేచిచూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి…
POMIS scheme : మధ్యతరగతి ప్రజలు, నెలవారీ స్థిర ఆదాయాన్ని కోరుకునే ఉద్యోగ విరమణ పొందినవారు తరచూ సురక్షితమైన పెట్టుబడి…
Brother : తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా, అలంగుడి సమీపంలోని పుల్లన్విడుటి గ్రామంలో కుటుంబంలో జరిగిన హత్యాచారం తీవ్ర సంచలనంగా మారింది.…
Pakiza : 1990 దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకీజా గుర్తుండే ఉంటుంది. ‘అసెంబ్లీ రౌడీ’…
Producer : దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు, బయట పెట్టిన లెక్కలన్నీ కూడా హాట్ టాపిక్‌గా…
Holidays : వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు బాగా అలసిపోయిన తరుణంలో జూన్ నెల పండగలేమీ లేకపోవడంతో కాస్త…
Jio Electric Bicycle : రిలయన్స్ జియో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు 400 కిమీ రేంజ్‌తో…
Anil Kumar Yadav : ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస…
This website uses cookies.