Home » Entertainment » Samantha Interview For Yashoda Movie Promotions
Entertainment

Samantha : నేను చనిపోవాలని కోరుకుంటున్నారు.. యశోద ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టిన సమంత.. వీడియో!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: November 8, 2022, 3:00 pm
Advertisement

Samantha : సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి వల్ల ఆమె ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సమంత ఆరోగ్యం ఎలా ఉంది. అసలు మయోసైటిక్స్ ప్రాణాతకమేనా అంటూ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు సమంత దాకా వెళ్లాయని తెలుస్తుంది. న్యూస్ చూస్తే చాలు తనకు వచ్చిన డిసీజ్ గురించి రకరాలుగా రాస్తున్నారు కొంతమంది అయితే నేను ఇక బ్రతకనని కూడా రాస్తున్నారు అవి చూసి బాధ వేస్తుంది అని అన్నారు సమంత. మయోసైటిస్ తో బాధపడుతున్నా సరే సమంత యశోద సినిమా ప్రమోషన్స్ కి వచ్చారు.

Advertisement

తనకు వచ్చిన ఈ వ్యాధి గురించి చెబుతూ సమంత జీవితంలో మంచి రోజులు ఉంటాయి.. చెడ్డ రోజులు ఉంటాయి.. ఒక్కోసారి ఒక అడుగు కూడా ముందు వేయలేని పరిస్థితి వస్తుంది. ఆ టైం లో మనం ఇంత దూరం ప్రయాణం చేశామా అని వెనక్కి చూసుకుంటే ఈ స్థాయికి చేరామా అని అనిపిస్తుంది. తన జీవితంలో ఇది చాలా కఠినమైన టైం.. దీన్ని ఎదురించి నిలబడాలి.. తానే కాదు తనలా చాలామంది భయంకరమైన వ్యాధులతో పోరాడుతున్నారు.. నేను దీన్ని గెలుస్తాను.. గెలిచి తీరిగి రాగలన్న ధైర్యం ఉందని అన్నారు.

Samantha Interview For Yashoda Movie Promotions

Advertisement

ఇక మరోపక్క తన మీద వస్తున్న వార్తలపై కూడా స్పందించారు సమంత. తాను ఇంకా బ్రతికే ఉన్నానని.. వ్యాధి వల్ల తాను చనిపోవాలని కోరుతున్న వారు ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత. యశోద సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గొన్న అమ్మడు సినిమా హిట్ కొట్టి తన సత్తా చాటాలని చూస్తుంది. సరోగసి నేపథ్యంతో తెరకెక్కిన ఈ యశోద సినిమా తన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని అంటున్నారు సమంత. యశోద సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని. తనకు రియల్ లైఫ్ కి దగ్గరగా ఈ కథ ఉంటుందని అన్నారు. సమంత యశోద మీద చాలా హోప్స్ తో ఉన్నట్టు తెలుస్తుంది.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి