Samantha : నయనతార బాటలోనే సమంత.. మరింత కిందకు పడిపోవడం తప్పదా?
Samantha : సినిమాల్లో ఎల్లకాలం టాప్ పొజిషన్‌లోనే కొనసాగడం అసాధ్యం. అలా అనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. హీరో, హీరోయిన్ వీరిలో ఎవరైనా కొంతకాలం వరకే టాప్ పొజిషన్‌లో ఉండ గలుగుతారు. అది కూడా సినిమాలు హిట్ అవుతుంటేనే ఆ స్థానం పదిలంగా ఉంటుంది. లేదంటే ఒక్కో మెట్టు కిందకు దిగాల్సిందే. పై స్థానంలోకి వెళ్లేందుకు కొన్నినెలలు పడితే .. దిగడానికి మాత్రం కేవలం రోజుల వ్యవధి మాత్రమే పడుతుంది.
Samantha : నయన్ లాగే సామ్ తప్పుచేస్తుందా..
తెలుగు ఇండస్ట్రీలో సమంత, నయనతార ఇద్దరూ మంచి పొజిషన్‌లో కొనసాగుతున్నారు. సినిమాల విషయంలో చూసుకుంటే సామ్ కంటే నయన్ ఎక్కువ సినిమాలు చేసింది. అగ్రహీరోలతో కూడా నటించింది. సామ్ ఇప్పటికీ మీడియం రేంజ్, కుర్ర హీరోలతో నటిస్తోంది. నయనతార కాస్త సీనియర్ కావడంతో ఆమె అగ్రహీరోలతో యాక్ట్ చేయడానికి ప్రయారిటీ ఇస్తుంది. ఇక సమంత తన భర్తతో విడాకులు తీసుకున్నాక చాలా వరకు కంటెంట్, రొమాన్స్, అందాల ప్రదర్శనకు సంబంధించిన సినిమాలు చేసేందుకు ఒప్పుకుంది. నయన్ మాత్రం పెళ్లికి ముందు అలాంటి సినిమాలు చేసింది.

Samantha is on the path of Nayantara
ఇటీవల నయన్ తన బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని అలాంటి అందాలను ప్రదర్శించే సినిమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుందట.. ప్రస్తుతం సమంత కూడా నయన్ బాటలో వెళ్లేందుకు సిద్ధమైందట.. మొన్నటివరకు ఐటమ్ సాంగ్స్ చేసిన సామ్ ఇకపై అలాంటి వాటిలో యాక్ట్చ చేయొద్దని డిసైడ్ అయ్యిందట.. అంతేకాకుండా బోల్డ్ కంటెంట్ మూవీస్ కూడా చేయద్దని ఫిక్స్ అయ్యిందట.. అయితే, ఈ ఇద్దరూ తీసుకన్న నిర్ణయం ఇండస్ట్రీలో అస్సలు మంచిది కాదని.. అందాలను ప్రదర్శించకపోతే త్వరలోనే అవకాశాలు తగ్గిపోతాయని దీంతో సామ్ కెరీర్ డౌన్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.