samantha is to receive a phone call from chiranjeevi
Samantha : మెగాస్టార్ చిరంజీవి వరుస పట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేశారు. ఏప్రిల్ నెలలో ఆచార్య, అక్టోబర్ నెలలో గాడ్ ఫాదర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండిటిలో గాడ్ ఫాదర్ తో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఇండస్ట్రీ మేలు కోరుతూ పలు మంచి పనులు చేస్తూ ఇంకా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు.
దీనిలో భాగంగా ఇటీవల సమంత ఆరోగ్యం బాలేదని మయోసిటీస్ అని అరుదైన వ్యాధికి గురికావడం పట్ల సోషల్ మీడియాలో చిరంజీవి రియాక్ట్ కావడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమంతకి నేరుగా చిరంజీవి ఫోన్ చేయటంతో… ఆమె షాక్ అయినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే సమంత టైటిల్ పాత్ర పోషించిన “యశోద” శుక్రవారం థియేటర్ లో విడుదల కావడం జరిగింది. సినిమా అద్భుతంగా ఉన్నట్లు పాజిటివ్ టాక్ రావడం జరిగింది. చాలామంది సినిమాలో సమంత నటన పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
samantha is to receive a phone call from chiranjeevi
అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నేరుగా సమంతకి ఫోన్ చేసి… అభినందించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి మరి తెలుసుకొని మరోసారి సమంతకి ధైర్యం చెప్పినట్లు మీడియా సర్కిల్స్ లో విశ్వసనీయ వార్త. ఇండస్ట్రీలో ఏదైనా సినిమా హిట్ అయింది అంటే కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి నుండి సదరు సినిమా యూనిట్ కి ఫోన్ కాల్ వెళ్తుంది. ఈ తరహాలోనే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమంతకి “యశోద” సినిమా విజయం సాధించటం పట్ల అభినందించి.. త్వరగా కోలుకోవాలని స్వయంగా చిరంజీవి ఫోన్ చేసి చెప్పటంతో షాక్ లో సమంత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.